రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 1,02,876 మందికి పరీక్షలు చేయగా.. 6,770 మందికి పాజిటివ్‌గా తేలింది. మహమ్మారి సోకి మరో 58 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12మంది మృతి చెందారు. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మరణించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,199, చిత్తూరు జిల్లాలో 968 కరోనా కేసులు నమోదవ్వగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 765, ప్రకాశం జిల్లాలో 530 కరోనా కేసులు వెలుగు చూశాయి.
Corona cases: రాష్ట్రంలో కొత్తగా 6,770 కరోనా కేసులు, 58 మరణాలు - ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 6,770 కరోనా కేసులు, 58 మరణాలు
16:43 June 13
కరోనా నుంచి కోలుకున్న మరో 12,492 మంది బాధితులు
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 12,492 మంది కోలుకోగా.. ప్రస్తుతం 85,637 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చదవండి:
WEATHER: నైరుతి రుతుపవనాల విస్తరణ.. రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం
Last Updated : Jun 13, 2021, 5:28 PM IST