ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శంషాబాద్ విమానాశ్రయంలో రూ.25 లక్షల బంగారం పట్టివేత - దుబాయ్ నుంచి వస్తున్న ప్రయాణికుని దగ్గర బంగారం పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టుబడింది. 667 గ్రాముల పుత్తడిని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్​ నుంచి వచ్చిన ఇండిగో విమానంలో ముద్ద రూపంలో ఉన్న 653 గ్రాముల బంగారం గుర్తించారు.

రూ.25 లక్షల బంగారం పట్టివేత

By

Published : Oct 31, 2019, 11:27 PM IST

హైదరాబాద్​ శంషాబాద్ విమానాశ్రయంలో 667.21 గ్రాముల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.25.6 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అతని వద్ద రూ. లక్షా 9 వేలు ఖరీదు చేసే ఐఫోన్, రూ.72 వేల విలువైన బూర్ఖాలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ఇండిగో విమానం ద్వారా శంషాబాద్ వచ్చిన ప్రయాణికుని వద్ద బంగారం ఉందన్న సమాచారంతో అతన్ని తనిఖీ చేశారు. 667.2 గ్రాముల బంగారాన్ని ఆరు స్థూపాకారపు గొట్టాలుగా తయారుచేసి పురుషనాళంలో దాచుకుని వచ్చినట్లు అధికారులు వివరించారు. ఇతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details