ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

5PM TOP NEWS
ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Sep 10, 2022, 5:00 PM IST

  • criticism of YCP వైకాపా నాయకుల 'నాడు - నేడు' కబ్జాలే.! చంద్రబాబు
    YCP leader నంద్యాల జిల్లా, పాణ్యం ఇందిరానగర్ లో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల వైకాపా నేత ఇల్లుగా మారిన ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇదిగిదిగో...వైకాపా ప్రభుత్వం 'నాడు - నేడు'! అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. విద్యార్థులు లేకపోతే వారిని బడికి రప్పించే కృషి చేయాల్సిన ప్రభుత్వం, పాఠశాల భవనాన్ని వైకాపా నేత కబ్జాకు వదిలెయ్యడాన్ని తప్పు పడుతూ చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విశాఖలో తీరంలో పర్యాటకుల భద్రత కోసం రంగంలోకి రోబోటిక్ బోట్‌
    Robotic boat విశాఖ సాగర తీరానికి కొత్త అతిథి వచ్చింది. విశాఖ సాగర తీరాన్ని సేఫ్ బీచ్‌గా రూపుదిద్దే కార్యక్రమంలో భాగంగా, ఆర్​కే బీచ్ వద్ద బ్యాటరీ సహాయంతో పనిచేసే లైఫ్ బాయ్ అనే రోబోటిక్ బోట్‌ ను ప్రవేశపెట్టారు. ఇది సముద్రంలో 700 మీటర్ల వరకు గల్లంతైన వారిని రక్షిస్తుందని, అధికారులు చెబుతున్నారు. ఈ బోట్ పనితీరును కలెక్టర్ మల్లికార్జున పరిశీలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఉద్యోగులకు శిక్ష.. పచ్చి కోడిగుడ్లు, బొద్దింకలు మింగాలి!
    అనగనగా ఓ సంస్థ.. ప్రతి నెలా ఒకటో తారీఖున రివ్యూ అనబడే.. ఉద్యోగ దర్బార్ నిర్వహిస్తుంది. మేనేజరుగా పిలవబడే యముడు.. సింహాసనంలో కూర్చుంచాడు. "టార్గెట్ రీచ్ కాలేకపోయిన పాపులను ప్రవేశ పెట్టుడి" అని ఆదేశిస్తారు. క్లర్కు అనబడే చిత్ర గుప్తుడు.. "చిత్తం మహాప్రభో" అంటూ.. చిట్టా చదవడం మొదలు పెడతాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గర్ల్స్ హాస్టల్​లో వీసీ చిందులు.. వీడియో వైరల్​
    VC Dances womens hostel తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి రవీందర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో గణేష్ నిమజ్జనం అనంతరం గర్ల్స్‌ హాస్టల్‌లో..ఇద్దరు బయటి వ్యక్తులతో కలిసి నృత్యాలు చేయడం వివాదాస్పదం అయ్యింది. డాన్సులు చేస్తూ.. డబ్బులు పంచడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీసీ ప్రవర్తనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మహిళల వసతిగృహంలోకి వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏడేళ్ల బాలికపై రేప్​.. యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన వృద్ధుడు
    ఇంటి బయట ఆడుకుంటున్న ఏడేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు యువకుడు. ఉత్తర్​ప్రదేశ్​ నగ్రాలో ఈ ఘటన జరిగింది. మరోవైపు మద్యం విషయంలో గొడవ తలెత్తగా యువకుడిపై పెట్రోల్​ పోసి నిప్పంటించాడు ఓ వృద్ధుడు. ఈ ఘటన ఝార్ఖండ్​ గఢ్వాలో జరిగింది. దేవుడికి పెట్టిన నైవేద్యం దొంగలించాడని ఓ బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టాడు పూజారి. మధ్యప్రదేశ్​ సాగర్​ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గేమింగ్ యాప్​ పేరుతో బడా ఫ్రాడ్​.. గుట్టు తేల్చిన ఈడీ.. రూ.7కోట్లు స్వాధీనం
    'మోసపూరిత' మొబైల్ గేమింగ్​ యాప్​ ప్రమోటర్​కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కీలక పురోగతి సాధించింది. కోల్​కతాలో సోదాలు జరిపి ఏకంగా రూ.7కోట్లు నగదు స్వాధీనం చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 5 కిలోల గుమ్మడికాయ రూ.47వేలు.. ఎందుకంత స్పెషల్?
    కేరళ ఇడుక్కిలో గుమ్మడికాయ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.47 వేలు. అదేంటి గుమ్మడికాయ అంత రేటు అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ ఓ సారి చదివేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్రిటన్​లో నవశకం.. రాజుగా ఛార్లెస్ అధికారిక ప్రకటన
    Britain New King : బ్రిటన్​ రాజ చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. బ్రిటన్​ రాణి క్వీన్​ ఎలిజబెత్​-2 మరణానంతరం.. ఆమె పెద్ద కుమారుడు, వేల్స్​ మాజీ యువరాజు ఛార్లెస్​ను నూతన రాజుగా అధికారికంగా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'పాక్​ కెప్టెన్ నేనే' అని చెప్పుకుంటున్న బాబర్.. ఇంతకీ ఏమైంది?
    ఆసియా కప్ 2022 లో భాగంగా శ్రీలంక-పాకిస్థాన్ మధ్య జరిగిన ఆఖరి సూపర్ 4 మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు. ఇంతకీ ఏమైందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విక్రమ్@100 రోజులు.. కమల్​ వాయిస్​ ట్వీట్​ వైరల్​!
    కమల్​ హాసన్​ హీరోగా తెరకెక్కిన 'విక్రమ్​' సినిమా బాక్సాఫీస్​ వద్ద బ్లాక్​బస్టర్​ హిట్​గా నిలిచింది. ఈ చిత్రం తాజాగా వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో కమల్​ చేసిన వాయిస్​ ట్వీట్​ వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details