ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

..

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Apr 20, 2022, 4:55 PM IST

  • మొత్తం 2.62 లక్షల టిడ్కో ఇళ్లు ఇవ్వాలనేది మా లక్ష్యం: మంత్రి సురేశ్‌
    ఒక్క రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. డిసెంబరు 2022 కల్లా 2.62 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Amara Raja Group Lands: అమరరాజా భూములపై యథాతథ స్థితి కొనసాగించాలి: హైకోర్టు
    High Court on Amara raja Group Lands: చిత్తూరు జిల్లా కరకంబాడిలో.. అమరరాజా సంస్థకు కేటాయించిన భూముల విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. సంస్థపై ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడవద్దని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విధిలేక ఒప్పుకున్నాం.. పీఆర్సీపై ఏ ఉద్యోగీ సంతృప్తిగా లేరు: సూర్య నారాయణ
    పీఆర్సీపై ఉద్యోగులు ఎవరూ సంతృప్తిగా లేరని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. సూర్యనారాయణ అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే పీఆర్సీని అంగీకరించాల్సి వచ్చిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • APIIC Chairman: నాకు గౌరవ వేతనం అవసరం లేదు.. ఆర్థికశాఖకు ఏపీఐఐసీ ఛైర్మన్ లేఖ
    APIIC Chairman: ఏపీఐఐసీ (APIIC)ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆర్థిక శాఖకు లేఖ రాశారు. ప్రభుత్వం చెల్లించే గౌరవ వేతనం తనకు వద్దంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కూలీ పిల్లలు 'కోటీశ్వరులు'.. ప్రభుత్వ సాయం కోసం తిప్పలు!
    కూలీ పనులు చేసుకునే తల్లిందండ్రులు, వారి పిల్లలు కోటీశ్వరులు.. అయినా ప్రభుత్వ సాయం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి. అదేంటి కోట్ల రూపాయలు ఉన్నవారికి ప్రభుత్వ సాయం అవసరమేంటి అనుకుంటున్నారా? అవునండీ అది నిజమే. ప్రభుత్వ అధికారులు చేసిన నిర్వాకం కథేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గెలుపు కోసం 'బాదుడే బాదుడు'.. ఇదో వెరైటీ గేమ్ గురూ!
    Slap fest 2022: విషు ఉత్సవాల్లో భాగంగా కేరళ కన్నూర్​లో చెంప దెబ్బల పోటీ నిర్వహించారు. అనేక మంది ఔత్సాహికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మావిళక్కువ ఆలయం సమీపంలోని పొలాల్లో.. జనం భుజాలపై ఎక్కి, ఎదురుగా ఉన్న ప్రత్యర్థి చెంప చెళ్లుమనిపించేందుకు పోటీపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బుచాలో మారణహోమం.. రష్యా దురాగతాలకు ఈ దృశ్యాలే సాక్ష్యం..!
    ఉక్రెయిన్‌లోని బుచా పట్టణం యుద్ధానంతర పరిస్థితులకు అద్దం పడుతోంది. రష్యా భీకర దాడులకు పూర్తిగా శిథిలమైన బుచాలో ఎటు చూసినా యుద్ధ సాక్ష్యాలే కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐదు వరుస సెషన్ల నష్టాలకు బ్రేక్​.. సెన్సెక్స్​ 570 ప్లస్​
    Stock Market Closing: ఐదు వరుస సెషన్ల నష్టాల నుంచి స్టాక్​ మార్కెట్లు కోలుకున్నాయి. సెన్సెక్స్​ 574, నిఫ్టీ 178 పాయింట్ల మేర పెరిగాయి. హెవీవెయిట్​ షేర్లలో మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం లాభాలకు కారణంగా విశ్లేషిస్తున్నారు నిపుణులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తల్లి కాబోతున్న షరపోవా... పుట్టినరోజునే గుడ్​న్యూస్
    టెన్నిస్ మాజీ నెం.1 మారియా షరపోవా గుడ్​న్యూస్ చెప్పింది. త్వరలో తల్లి కాబోతున్నట్లు ఇన్​స్టాగ్రామ్​ ద్వారా వెల్లడించింది. పుట్టినరోజునే ఈ శుభవార్త చెప్పడం విశేషం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కాజల్ ముద్దుల కుమారుడి పేరేంటో తెలుసా?
    టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్​.. మంగళవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె సోదరి నిషా అగర్వాల్, భర్త గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించారు. అయితే.. కాజల్ కొడుకు ఎలా ఉన్నాడో, ఏం పేరు పెట్టబోతున్నారో అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. దీనికి సంబంధించి కాజల్​ భర్త గౌతమ్​ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details