ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - breaking news

.

5pm top news
ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : Jun 13, 2021, 5:01 PM IST

Updated : Jun 13, 2021, 5:38 PM IST

  • జ‌మ్మూలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణానికి భూమిపూజ‌
    భూతలస్వర్గమైన జమ్మూ (Jammu)లో శ్రీవారు కొలువుదీరేందుకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. తితిదే (TTD) నిర్మించతలపెట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఇవాళ భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మెరుగైన వైద్యం అందించాలి: మంత్రి ఆళ్ల నాని
    తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఆందోళనపై మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. కొవిడ్‌, బ్లాక్‌ఫంగస్‌కు సరైన వైద్యం అందలేదని రోగుల బంధువులు ఆందోళన చేయడంతో ఆస్పత్రిలో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కరోనా, బ్లాక్ ఫంగస్ రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మఠాధిపతులతో కమిటీ: మంత్రి వెల్లంపల్లి
    కడప జిల్లాలోని బ్రంహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక వివాద పరిష్కారం కోసం మఠాధిపతులతో కమిటీని నియమించనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. పీఠాధిపతి ఎంపికపై అభ్యంతరాలు, అభిప్రాయాలు, సూచనలను తెలుసుకుని చర్చించి వీలైనంత త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మోదీ-ఉద్ధవ్​ భేటీ!
    ప్రధాని నరేంద్ర మోదీతో ఉద్ధవ్ ఠాక్రే భేటీ అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక ఏదో జరుగుతుందనే ప్రచారం ఊపందుకుంది. శివసేన నేత సంజయ్​ రౌత్, కాంగ్రెస్​ నాయకుడు నానా పటోలే వ్యాఖ్యలు, శరద్ పవార్​తో పీకే సమావేశం వంటి పరిణామాలు ఇందుకు మరింత బలాన్నిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మన టీకాలు భేష్!
    మహమ్మారిపై విజయం సాధించేందుకు వ్యాక్సినేషనే బ్రహ్మాస్త్రమని చాటేలా పలు అధ్యయనాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్​పై భారతీయ టీకాలు అత్యంత సమర్థంగా పనిచేస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. టీకా తీసుకున్న హెల్త్​కేర్​ వర్కర్లపై ఈ పరిశోధన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కరోనా మాత' ఆలయం కూల్చివేత
    ఉత్తర్​ప్రదేశ్​ ప్రతాప్​గఢ్​లో కొత్తగా నిర్మించిన 'కరోనా మాత' ఆలయాన్ని అధికారులు కూల్చేశారు. ప్రజలు మూఢనమ్మకాల్లో చిక్కుకోకూడదని ఇలా చేసినట్లు అధికార యంత్రాంగం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఐపీఓకు రానున్న ఆ కంపెనీలు
    ఒక్క వారమే నాలుగు కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇందులో హైదారాబాద్​ కేంద్రంగా పని చేస్తున్న కంపెనీలే రెండు ఉండటం గమనార్హం. మరి ఐపీఓకు రానున్న ఆ కంపెనీలు ఏవి? ఆయా సంస్థల ఐపీఓ షేరు ప్రైస్​ బ్యాండ్​​ ఎంత? అనే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భారత్​తో ఇంగ్లాండ్​కు కష్టమే
    భారత్​తో జరగనున్న ఐదు మ్యాచ్​ల టెస్ట్​ సిరీస్​పై స్పందించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్​ మైకేల్ వాన్. పచ్చికతో ఉన్న పిచ్​లను సిద్ధం చేయడం వల్ల రూట్​ సేనకు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నాడు. కివీస్​తో సిరీస్​కు ఒక్క స్పెషలిస్ట్​ స్పిన్నర్​ కూడా జట్టులో లేకపోవడం ఇబ్బందిగా మారిందని తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'పెద్దరాయుడు' గుర్తుగా సాంగ్​
    డైమండ్ ర‌త్న‌బాబు దర్శకత్వంలో మోహ‌న్ బాబు(Mohanbabu) హీరోగా నటిస్తున్న చిత్రం 'సన్​ ఆఫ్​ ఇండియా'(Son of India). ఈ చిత్రానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియో సాంగ్​ను జూన్​15న విడుదల చేయనున్నట్లు తెలిపారు మోహన్​బాబు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated : Jun 13, 2021, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details