ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM

ప్రధాన వార్తలు @ 5 PM

By

Published : May 9, 2021, 4:59 PM IST

5PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 5PM

  • హైదరాబాద్​కు కర్నూలు పోలీసులు..!

కర్నూలు జిల్లాలో చంద్రబాబుపై నమోదైన కేసులో పోలీసులు హైదరాబాద్​కు రానున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు నివాసానికి వచ్చి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫ్రంట్ లైన్ వారియర్స్​గా గుర్తించండి

ప్రభుత్వం తమను కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్​గా గుర్తించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది. డీలర్లందకీ ఉచితంగా కరోనా టీకా వేయాలని ఆ సంఘం అధ్యక్షుడు మాధవరావు ప్రభుత్వాన్ని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రభుత్వ భూమిలో ప్రైవేటు దందా.. !

అది నిన్నటి దాకా ప్రభుత్వ భూమి. నేడు అక్రమార్కుల పరమైంది. వారి కన్ను పడ్డ మరుక్షణం నుంచే అక్కడ తవ్వకాలు మొదలయ్యాయి. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అక్కడి మట్టిని తరలిస్తున్నా అడిగేవారూ, అడ్డుచెప్పేవారు కరవయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీఎంలకు మోదీ ఫోన్​

పంజాబ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్​ రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈమేరకు ఫోన్లో చర్చించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మోదీకి దీదీ విన్నపం

కరోనా చికిత్సలో వినియోగించే పరికరాలు, ఔషధాలపై పన్నులను మాఫీ చేయాలని ప్రధానమంత్రిని కోరారు బంగాల్ సీఎం మమతా బెనర్జీ. తద్వారా వీటి సరఫరా సాఫీగా కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్రాలకు మరో 46 లక్షల టీకాలు

మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ సహా 10 రాష్ట్రాల్లోనే భారీగా కరోనా కేసులు నమోదవుతున్నట్లు కేంద్రం తెలిపింది. శనివారం నమోదైన కేసుల్లో 71.75 శాతం.. ఈ రాష్ట్రాల్లోనే వెలుగు చూసినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్కడికి రైలులో వెళ్లాలంటే.. ఇదీ తప్పనిసరి!

పశ్చిమ బంగాల్​లోకి వెళ్లే ప్రయాణికులకు 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ నివేదిక తప్పనిసరి చేస్తూ.. దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలను అధికారిక వైబ్​సైట్​లో ఉంచినట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వేగంగా రిలయన్స్ రిటైల్ వృద్ధి !

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ ఈ ఏడాదికిగానూ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న రెండో రిటైల్ సంస్థగా నిలిచింది. దీనితోపాటు గ్లోబల్​ పవర్ ​ఆఫ్​ రిటైలింగ్​లో ఈ సంస్థ ర్యాంక్ 56 నుంచి 53కు మెరుగైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'జరిగిన మ్యాచ్​లకే డబ్బులు'

కొవిడ్ వల్ల ఐపీఎల్​ వాయిదా పడిన నేపథ్యంలో స్టార్​ ఇండియా ఛానల్ స్పందించింది. తమ స్పాన్సర్లు, ప్రకటనకర్తలు.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్​లకే డబ్బులు చెల్లించాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కాళికాదేవిలా సాయిపల్లవి.. సంపూర్ణేశ్​బాబు 'క్యాలీఫ్లవర్'

కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో శ్యామ్ సింగరాయ్, క్యాలీఫ్లవర్, కొత్తగా రెక్కలొచ్చెనా చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details