రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కేసుల సంఖ్య 813కు చేరింది. గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 19 చొప్పున కొత్త కేసులు నిర్థరణ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనాతో మరో ఇద్దరు మృతి చెందినట్లు హెల్త్ బులెటిన్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 24కు చేరినట్లు వెల్లడించింది. కొత్తగా 24 మందిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు తెలిపింది.
కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి - ఏపీలో కరోనా వైరస్ వార్తలు
56-new-more-corona-possitive-cases-in-ap
Last Updated : Apr 22, 2020, 11:45 AM IST