- రైతులను ఆదుకునేందుకు సీఎం కీలక ఆదేశాలు
పొగాకు రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ఏపీ మార్కెటింగ్ శాఖ ద్వారా పొగాకు కొనుగోళ్లు చేయాలని నిర్ణయించారు. పొగాకు కనీస ధరలను త్వరలో ప్రకటించాలని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- మెజిస్ట్రేట్ ముందుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తెదేపా నాయకుడు జేసీ ప్రభాకర్‌రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అనంతపురం ఒకటో పట్టణ పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డిని విచారించాలని కోర్టులో పీటీ వారంట్లు వేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- 'అన్ని పిటిషన్ల పై ఒకేసారి విచారణ చేపడతాం'
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ పునర్ నియాకాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం వేసిన పిటిషన్‌పై సీజేఐ ఎస్ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- 'లోకేశ్ లక్ష్యంగా వైకాపా మంత్రుల దాడి'
శాసనమండలిలో వైకాపా మంత్రులు లోకేశ్‌ని లక్ష్యంగా చేసుకుని దాడికి విశ్వ ప్రయత్నం చేశారని తెదేపా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ఆరోపించారు. లోకేశ్ తన ఫోన్లో మెసేజ్‌లు చూస్తుంటే.. ఫోటోలు తీస్తున్నాడని ఆయనపై దాడికి వచ్చారని మండిపడ్డారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
- చైనా వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డ భారత్
గాల్వన్ లోయ తమదేనంటూ చైనా చేస్తోన్న వ్యాఖ్యలపై భారత్ మరోసారి మండిపడింది. ఈ వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
చైనా కంపెనీతో రైల్వే కాంట్రాక్ట్ రద్దు!