ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడో విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి - panchyathi elections news

మూడో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి అయ్యింది. మూడో విడత ఎన్నికల్లో 579 సర్పంచులు, 11,732 వార్డులు ఏకగ్రీవం అయ్యినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

3rd Phase Naminations Scrutiny Over
మూడో విడత ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి

By

Published : Feb 13, 2021, 8:41 PM IST

పంచాయితీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల పరిశీలన పూర్తి అయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మూడో విడతలో మొత్తం 3,221 పంచాయతీలకు గానూ 2,640 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నట్టు కమిషన్ కార్యాలయం వెల్లడించింది. మూడో విడత ఎన్నికల్లో 579 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని వెల్లడించింది. అలాగే 11,732 వార్డులు ఏకగ్రీవాలు అయినట్టు తెలియజేసింది. దీంతో మిగిలిన 2,640 పంచాయతీలకు ఈ నెల 17వ తేదీన ఎన్నికలు జరగునున్నట్టు వెల్లడించింది.

సర్పంచ్ పదవుల కోసం మొత్తంగా 7,756 మంది అభ్యర్దులు పోటీలో ఉన్నట్టు ఎస్ఈసీ తెలిపింది. మొత్తం 31,516 వార్డులకు గానూ.. 19,607 వార్డులకు ఎన్నికలు జరగనున్నట్టు స్పష్టం చేసింది. వార్డు సభ్యుల పదవుల కోసం 43,282 మంది అభ్యర్ధుల పోటీలో ఉన్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details