ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm

.

By

Published : Sep 11, 2020, 3:02 PM IST

3pm_Topnews
ప్రధాన వార్తలు @ 3pm

  • 'వైఎస్​ఆర్ ఆసరా'కు శ్రీకారం
    మహిళలను లక్షాధికారులను చేయటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. మహిళల ఆర్ధిక సాధికారత సహా వారి అభ్యుదయం కోసం రాష్ట్రంలో పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'జగనే హిందుత్వంపై ఎక్కుపెట్టిన గన్'
    హిందూత్వంపై ఎక్కుపెట్టిన గన్ జగనేనని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మూర్ఖత్వం, క్రూరత్వం తప్ప దేవుడు అంటే నమ్మకం లేని వాడు జగన్ అని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • చంద్రబాబు, లోకేశ్ సంతాపం
    చలమలశెట్టి రామానుజయ్య మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్​, ఆ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కాపు కార్పోరేషన్ తొలి ఛైర్మన్‌గా ఆయన విశేష సేవలందించారనని చంద్రబాబు కొనియాడారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నిబంధనలు బేఖాతర్ ..!
    కరోనా నిబంధనల అమలులో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. సామాన్యులకు ఒక విధంగా... అధికార పార్టీ నాయకులకు మరో విధంగా అమలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కోవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • నీట మునిగిన మంగళూరు
    భారీ వర్షాలకు కర్ణాటకలోని మంగళూరు నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'నైతిక విద్య అవసరం'
    విలువల ఆధారిత విద్యావ్యవస్థను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్రీరామచంద్ర మిషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలనూ ఆయన ప్రశంసించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • హ్యాకర్ల దాడి!
    నవంబరులో జరగనున్న అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు హ్యాకర్లు ప్రయత్నిస్తున్నారని తెలిపింది ప్రముఖ టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​. రష్యా, చైనా, ఇరాన్ దేశాల్లోని కొన్ని సంస్థలు ఈ పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించింది. ఆ సంస్థల పేర్లను కూడా మైక్రోసాఫ్ట్ బయటపెట్టడం విశేషం.‌పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • విక్రయాలు పెరిగాయ్
    దేశీయంగా వాహన విక్రయాలు ఆగస్టులో మళ్లీ జోరందుకున్నాయి. 2019 ఆగస్టుతో పోలిస్తే.. గత నెల ప్యాసింజర్​ వాహనాల విక్రయాలు 14.6 శాతం పెరిగినట్లు సియామ్​ గణాంకాల చెబుతున్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
  • 'ఐపీఎల్​తో సాధారణ స్థితికి'
    ఈ ఏడాది ఐపీఎల్ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పాడు రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు రాబిన్​ ఉతప్ప. ఈ సీజన్​లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజేతగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ​పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details