ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ap top ten news

..

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

By

Published : Jun 18, 2022, 2:58 PM IST

  • కొత్తవలసలో కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. ఒడిశా వాసి మృతి
    Agnipath effect on trains: అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో అర్ధాంతరంగా రైలును నిలిపివేయటంతో ఓ ప్రాణం పోయింది. అత్యవసర చికిత్స కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ గుండె జబ్బు బాధితుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా కొత్తవలసలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విజయవాడలో హై అలర్ట్.. అర్ధరాత్రి అందోళనకారుల అరెస్టు
    High alert at Vijayawada : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషనలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ఆందోళన దిగిన విద్యార్థి సంఘాల నాయకులను శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఎం నేతలను సైతం అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అగ్నిపథ్‌ నిరసనలు.. శ్రీకాకుళం, విజయనగరం రైల్వేస్టేషన్లలో హైఅలర్ట్​
    High Alerts at Railway Stations: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్‌లలో నిరసనలు మిన్నంటుతున్న వేళ... రాష్ట్రంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకుకుళం జిల్లాల్లోని రైల్వేస్టేషన్లలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనుమానాస్పదంగా ఉన్న వారిని గుర్తించేందుకు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వాట్సాప్​లో పెద్ద ఎత్తున పోస్టులు.. పోలీసుల అదుపులో యువకుడు
    Agnipath Agitation: విశాఖ రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న ఓ యువకుడిని పోలీసులు గుర్తించారు. స్టేషన్​కు ఏ మార్గం ద్వారా చేరుకోవాలో.. వాట్సాప్​లో పెద్ద ఎత్తున పోస్టు చేస్తున్నట్లు గుర్తించి.. అదుపులోకి తీసుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ను మూసివేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అగ్నిపథ్​' నిరసనలతో ఆగని ట్రైన్​​​.. వ్యక్తి మృతి.. రైలులోనే మహిళ ప్రసవం
    సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన 'అగ్నిపథ్'​పై నిరసనలు కొనసాగుతున్నాయి. దీంతో దేశంలో పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఘాజీపూర్‌లో దిల్లీకి వెళ్లే ఓ రైలు నిలిచిపోయింది. అదే సమయంలో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ రైలులో బిడ్డకు జన్మనివ్వాల్సి వచ్చింది. అదే రైలులో చికిత్స కోసం వెళ్తున్న మరో వ్యక్తి మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆ విషయంలో తగ్గేదే లే'.. అగ్నిపథ్‌ పథకంపై రాజ్‌నాథ్‌
    Agnipath scheme controversy: అగ్నిపథ్​ పథకంపై దేశవ్యాప్తంగా నిరసలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నేవీ, ఎయిర్​ఫోర్స్​ చీఫ్​తో పాటు ఆర్మీ వైస్​చీఫ్​తో భేటీ అయ్యారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఈ పథకం అమలుపై సమీక్ష చేపట్టిన రాజ్​నాథ్​.. అగ్నిపథ్​ను మరోసారి సమర్థించారు. అగ్నివీరులకు శిక్షణ ఇచ్చే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రియురాలు, ఆమె సోదరుడిని సుత్తితో కొట్టి చంపిన బాయ్​ఫ్రెండ్​!
    ఝార్ఖండ్​లోని రాంచీలో దారుణం జరిగింది. అక్కాతమ్ముళ్లను దుండగులు సుత్తితో కొట్టి చంపేశారు. కుమార్తె బాయ్​ఫ్రెండే వీరిని చంపేశాడని తల్లి ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి
    ఆదాయ పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు సమయం ఆసన్నమైంది. అధికారిక వెబ్​సైట్​లో ఫారాలను పరిశీలించి రిటర్నుల ప్రక్రియను పూర్తి చేసేయొచ్చు. అయితే అందుకు ఏం చేయాలంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఫాస్టెస్ట్​ 150 స్కోరు.. టాప్​-5లో ఎవరున్నారంటే?
    Jos buttler 150 plus score: వన్డే క్రికెట్‌లో ఎవరైనా సెంచరీలు కొట్టడం సాధారణ విషయమే. అదే 150 పరుగులు చేయడం.. అంత పెద్ద స్కోరును కూడా అతి తక్కువ బంతుల్లోనే సాధించడం గొప్ప విశేషం. శుక్రవారం నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జోస్‌ బట్లర్‌ అదేపని చేశాడు. కేవలం 65 బంతుల్లోనే 150 పరుగులు చేసి త్రుటిలో ప్రపంచ రికార్డును మిస్‌ చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బండ్లగణేశ్ ఆడియో మెసేజ్​ వైరల్​.. అందులో ఏముందంటే?
    Producer Bandla ganesh Audio message: ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్​.. తాజాగా ఓ ఆడియో సందేశాన్ని షేర్​ చేశారు. తల్లిదండ్రుల్ని, భార్యాపిల్లల్ని తప్ప జీవితంలో ఎవర్నీ నమ్మకూడదని చెప్పారు. ప్రస్తుతం ఈ ఆడియో మెసేజ్​ సోషల్​మీడియాలో వైరల్​ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details