ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM - ap top ten news

.

3pm Top news
ప్రధాన వార్తలు @3PM

By

Published : Dec 28, 2021, 3:00 PM IST

  • లైసెన్స్ లేకనే థియేటర్లు మూసేశారు : మంత్రి పేర్ని నాని

థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో ప్రభుత్వం చర్చలు జరిపింది. సినిమా టికెట్ల ధరలు, థియేటర్లలో తనిఖీపై మంత్రి పేర్ని నాని చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో నేరాలపై వార్షిక నివేదిక విడుదల

రాష్ట్రంలో నేరాలపై డీజీపీ గౌతమ్​ సవాంగ్​ వార్షిక నివేదిక విడుదల చేశారు. 75 అత్యాచారాలు, 1061 లైంగికదాడుల కేసుల్లో 7 రోజుల్లోనే ఛార్జిషీటు వేసినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బలవంతం లేదంటూనే.. బెదిరిస్తున్నారు: అచ్చెన్నాయుడు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. పథకాలను ఆపేస్తామంటూ ప్రజలను బెదిరిస్తున్నారన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న తెదేపా నేతలను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సుండుపల్లిలో అధికార పార్టీ నేతల మధ్య ఘర్షణ

కడప జిల్లా సుండుపల్లిలో మంగళవారం అధికార పార్టీలో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. సుండుపల్లిలో జరిగిన ఆసరా సమావేశానికి ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున్ రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డిలు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ హబ్‌గా భారత్​'

దేశం మరో స్వర్ణయుగంలోకి అడుగుపెడుతోదని .. సాంకేతికంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సార్టప్​ హబ్​గా అవతరించిందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'చరిత్రను కాలరాసి.. దేశ వారసత్వాన్ని చెరిపేందుకు కుట్ర'

బలమైన భారత్‌ను అభివృద్ధి చేసేందుకు ఏళ్ల తరబడి పార్టీ నేతలు వేసిన దృఢమైన పునాదిని బలహీనపరిచేందుకు కొన్ని విద్వేషపూరిత సిద్ధాంతాలు ప్రయత్నిస్తున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒమిక్రాన్​ కట్టడికి మరిన్ని ఆంక్షలు.. పాఠశాలలు బంద్​!

ఒమిక్రాన్​ వ్యాప్తితో రాష్ట్రాలు మళ్లీ ఆంక్షల వలయంలోకి జారుకుంటున్నాయి. ఇప్పటికే అనే రాష్ట్రాలు నైట్​ కర్ఫ్యూను విధించాయి. తాజాగా ఒమిక్రాన్​ కట్టడికి మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఐసొలేషన్, క్వారంటైన్​​ లెక్కలు మారాయ్.. కొత్త రూల్స్ ఇవే...

క్వారంటైన్​.. ఐసొలేషన్​.. కొవిడ్​ మహమ్మారి పుట్టినప్పటి నుంచి వింటున్న మాటలు ఇవి. వీటి నిబంధనల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అధికారులు మరికొన్ని మార్పులు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సూర్యకుమార్​ మంచి మనసు.. గ్రౌండ్స్​మెన్ కోసం!

టీమ్​ఇండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.. ఓ లోకల్​ టోర్నమెంట్​లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. అత్యధిక పరుగులు చేసి 'ప్లేయర్​ ఆఫ్​ ద మ్యాచ్' సొంతం చేసుకున్నాడు. అనంతరం ఈ అవార్డును గ్రౌండ్స్​మెన్​కు డొనేట్ చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇదే మోహన్​ బాబు ఇల్లు.. చూస్తే షాకవుతారు!

సీనియర్​ నటుడు మోహన్​ బాబు ఇంటిని నెటిజన్లకు పరిచయం చేశారు నటి మంచు లక్ష్మి. హైదరాబాద్‌లో ఉన్న ఈ ఇంటిపై ఆమె హోం టూర్ వీడియో చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details