ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM

ప్రధాన వార్తలు @3PM

3pm Top news
3pm Top news

By

Published : Nov 30, 2021, 3:01 PM IST

  • 'డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించలేకపోతున్నా'

డాలర్ శేషాద్రి లేని తిరుమలను ఊహించలేకపోతున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ అన్నారు. 25 ఏళ్లుగా శేషాద్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • నాయీబ్రాహ్మణ సంఘం ఫిర్యాదుపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్

నాయీబ్రాహ్మణ సంఘం ఫిర్యాదుపై జాతీయ బీసీ కమిషన్‌ స్పందించింది. 15 రోజుల్లో విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • మరో 12 గంటల్లో దక్షిణ అండమాన్​లో అల్పపీడనం!

మరో 12 గంటల్లో దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. 48 గంటల్లో ఇది మరింత బలపడుతుందని తెలిపింది.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • రాష్ట్రంలో వరదలపై రాజ్యసభలో ఎంపీలు గళం

రాష్ట్రంలో వరదలపై పార్లమెంట్​లో ఎంపీలు మాట్లాడారు. వర్షాల కారణంగా పలు జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నాయని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. వర్షాలపై వాతావరణ శాఖ ముందే సమాచారమిచ్చినా సరైన చర్యలు తీసుకోలేదని భాజపా ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • ఒమిక్రాన్​పై కేంద్రం అప్రమత్తం.. రాష్ట్రాలతో కీలక భేటీ

Omicron India: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్​ సమావేశమయ్యారు. వైరస్ నిర్ధరణ పరీక్షలను వేగవంతం చేయాలని సూచించారు. వైరస్ కట్టడికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • ఒకదాన్నొకటి ఢీకొన్న 11 వాహనాలు

Faridkot Accident: పంజాబ్ ఫరీద్​కోట్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా 11 వాహనాలు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. కార్లు ధ్వంసమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • ఎక్స్​పో కోసం త్వరలో దుబాయ్​కు మోదీ!

వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ దుబాయ్​ ఎక్స్​పోను సందర్శించనున్నట్లు సమాచారం. ఇజ్రాయిల్​, అమెరికా, యూఏఈలు భారత్​తో సంయుక్త భేటీ నిర్వహించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో అగ్రాసనం భారతీయులదే..

అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థలకు.. ముఖ్యంగా అమెరికాకు చెందిన కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయులు సంఖ్య పెరుగుతోంది. సుందర్​ పిచాయ్​, సత్యనాదెళ్ల, శంతను నారాయన్​ సహా పలువురు ప్రపంచ స్థాయి సంస్థలకు సీఈఓలుగా(Indian origin CEOs in World) ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • 'గెలవడం కోసం కాదు డ్రా చేస్తే చాలనుకున్నారు'

Gavaskar Slams NZ: భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్​లో కివీస్​ బ్యాటింగ్​ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. గెలవాలని కాకుండా, డ్రాగా ముగిస్తే చాలని ఆడటం సరికాదని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

  • ఓటీటీలో బాలయ్య గర్జన.. టాక్​ షోల్లో 'అన్​స్టాపబుల్​' రికార్డు!

Unstoppable With NBK: ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ చేస్తున్న 'అన్​స్టాబుల్​ విత్ ఎన్​బీకే' షో.. అత్యధిక వ్యూస్ పొందిన తెలుగు టాక్ షోగా నిలిచినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ABOUT THE AUTHOR

...view details