- 'ఆ బాధ్యత కేంద్రానిదే'
బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచే బాధ్యత కేంద్రానిదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుపై కేంద్రం చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కొవిడ్ నియంత్రణ చర్యలు, బ్లాక్ ఫంగస్ కేసులపై హైకోర్టులో విచారణ జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కష్టపడేవారికి సముచిత స్థానం
నరసరావుపేట, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాలకు తెదేపా కమిటీలను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడేవారికి సముచిత స్థానం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆరోగ్యశ్రీ అమలు కావడం లేదు'
అధికారంలోకి వచ్చాక.. పారదర్శకంగా పరిపాలన అందిస్తానన్న మాట ఏమైందని సీఎం జగన్ను మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మైలవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుమారుడి కళ్లను కాపాడిన తల్లి
ఒక్కగానొక్క కుమారుడు క్షణికావేశంలో తన నుంచి దూరం అయినా.. అతడి కళ్లను సజీవంగా ఉంచాలనుకుంది ఆ తల్లి. ఈ మేరకు ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తన కుమారుడి నేత్రాలను దానం చేసింది. పుట్టెడు దుఃఖంలోనూ.. ఇంతటి గొప్ప ఆలోచన చేసిన ఆమెను వైద్యులు అభినందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పీఏసీ భేటీలో దుమారం!
పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సమావేశంలో.. ఎంపీల మధ్య వాగ్వాదం జరిగింది. వ్యాక్సిన్ విధానాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ టీకా భేష్!