ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధానవార్తలు@ 3PM

....

3PM Top news
3PM Top news

By

Published : May 14, 2021, 3:00 PM IST

  • సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి

సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆంశంపై సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్‌ తెలంగాణ అధికారులతో మాట్లాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తెలంగాణ: రాష్ట్ర సరిహద్దులో అంబులెన్సుల నిలిపివేతపై హైకోర్టులో పిల్

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టులో పిల్ దాఖలైంది. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి వెంకటకృష్ణారావు హౌస్ మోషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంత చేతకాని ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి ఉండకూడదు : లోకేశ్

రాష్ట్రంలో ప్రజలకు సరైన వైద్యం దొరికితే తెలంగాణకు ఎందుకెళ్తారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. ఏపీలో ప్రాణాలు నిలవకపోగా, వైద్యం కోసం ప‌క్క రాష్ట్రానికి వెళ్లే అవకాశం కూడా లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా కల్లోలం : మనస్థాపంతో బావిలో దూకి కుటుంబం ఆత్మహత్య

విజయనగరం జిల్లాలో కరోనా మహమ్మారి ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. కరోనా సోకడంతో వేపాడ మండలం నల్లబెల్లిలో కుటుంబమంతా బలవన్మరణానికి పాల్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • గోవా ఆసుపత్రిలో ఆక్సిజన్​ అందక 76మంది మృతి

గోవా వైద్య కళాశాల ఆసుపత్రిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆక్సిజన్​ కొరతతో 24గంటల్లో 76మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జైలులో కాల్పులు- ముగ్గురు మృతి

యూపీ రగౌలీ జిల్లాలోని జైలులో జరిగిన కాల్పుల ఘటనలో ముగ్గురు మృతిచెందారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జియో ఫోన్​ యూజర్లకు ఫ్రీ టాక్​టైమ్​

కరోనా మహమ్మారి నేపథ్యంలో రిలయన్స్​ సంస్థ జియోఫోన్​ వినియోగదారులకు ఫ్రీ టాక్​టైమ్​ ప్రకటించింది. నెలకు 300 నిమిషాల ఫ్రీ ఔట్​గోయింగ్​ కాల్స్​ను అందించనున్నామని తెలిపింది. ఈ ఆఫర్లు వార్షిక ప్లాన్లు, జియోఫోన్​ డివైస్​ బండల్డ్​ ప్లాన్స్​కు ​వర్తించవని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • హ్యాకర్లతో కుదరని బేరం- పోలీసుల వ్యక్తిగత డేటా లీక్!

అమెరికా పోలీసుల వ్యక్తిగత సమాచారాన్ని హ్యాక్ చేసింది ఓ ర్యాన్సమ్​వేర్ గ్యాంగ్. ఎక్కువ మొత్తం చెల్లించాలని డిమాండ్ చేసింది. పోలీసు శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల గురువారం ఈ డేటాను డార్క్​వెబ్​లో విడుదల చేసిందని అసోసియేటెడ్​ ప్రెస్​ ఓ కథనం ప్రచురించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నా కెరీర్​ రూపకల్పనలో అతడిదే ప్రధాన పాత్ర'

తన కెరీర్ రూపకల్పనలో న్యూజిలాండ్ మాజీ బౌలర్​, ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్​ షేన్ బాండ్ ప్రధాన పాత్ర పోషించాడని తెలిపాడు భారత బౌలర్​ జస్ప్రీత్ బుమ్రా. బాండ్​తో మంచి అనుబంధం ఉందని.. మున్ముందు కూడా అది కొనసాగుతుందని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనాతో టాలీవుడ్ దర్శకుడు మృతి

టాలీవుడ్ దర్శకుడు నంద్యాల రవి కరోనా కారణంగా కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details