- లైవ్: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సీఎం అదనపు ముఖ్యకార్యదర్శి రాజీనామాకు ఆమోదం
సీఎం జగన్ అదనపు ముఖ్యకార్యదర్శి పీవీ రమేష్ రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల ఒకటవ తేదీన పీవీ రమేష్ రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంత్రి పేర్ని నాని కుటుంబానికి సీఎం పరామర్శ
మంత్రి పేర్ని నాని కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. రెండ్రోజుల కిందట మంత్రి పేర్ని నాని మాతృమూర్తిని కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అలాంటి వారు రాజకీయాల్లో ఉండకుండా చట్టం తేవాలి'
అధికార పార్టీ తీరుపై.. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీవ్రంగా మండిపడ్డారు. కనీస జ్ఞానం లేని వారు రాజకీయాల్లో ఉండకూడదనే చట్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'బాధ్యతాయుతంగా ఉండేవారికే మెరుగైన అవకాశాలు'
గుజరాత్లో పండిత్ దీన్‌దయాల్ పెట్రోలియం విశ్వవిద్యాలయం(పీడీపీయూ) 8వ స్నాతకోత్సవ వేడుకకు వర్చువల్‌గా హాజరయ్యారు ప్రధాని మోదీ. 45 మెగావాట్ల సౌర విద్యుత్తు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశ యువతకు కీలక సూచనలు చేశారు మోదీ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్ భయంతో కూలీలు వెనుకంజ.. 'డ్రోన్లే' అండ!
కరోనా కారణంగా రైతులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వైరస్ నేపథ్యంలో వ్యవసాయ పనులకు కూలీలెవరూ ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో.. ఫెర్టిలైజర్స్ పిచికారీ కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు కేరళ రైతులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ నిషేధం
భారత ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాలపై మరోమారు నిషేధం విధించింది హాంకాంగ్. డిసెంబర్ 3 వరకు నిషేధం అమలులో ఉంటుందని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాబూల్‌లో రాకెట్ల దాడి.. 8 మంది మృతి
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి పేలుళ్లతో ఉలిక్కిపడింది. కాబూల్‌లోని గ్రీన్ జోన్‌కు సమీపంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో వరుస పేలుళ్లు, రాకెట్ల దాడులు జరిగినట్లు అధికారిక వర్గాల సమాచారం. 20కి పైగా రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కోలుకుంటున్నా.. : రోహిత్
గాయం నుంచి కోలుకుంటున్నట్లు చెప్పిన స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లో ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు. తన గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అస్సలు పట్టించుకోనని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ రోజులు గుర్తొచ్చాయి: సూర్య
'ఆకాశం నీ హద్దురా' చిత్రీకరణ సమయంలో తన తొలి ఉద్యోగం చేసిన రోజులు గుర్తొచ్చాయని హీరో సూర్య చెప్పారు. అందుకే హావభావాలు పలికించగలిగానని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 3 PM