ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

ప్రధాన వార్తలు@ 3PM
ప్రధాన వార్తలు@ 3PM

By

Published : Oct 14, 2020, 3:00 PM IST

  • వరదలపై సీఎం జగన్‌ సమీక్ష
    రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • విచారణ అక్టోబరు 20కు వాయిదా
    హైదరాబాద్‌లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ జరిగింది. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • వర్ష బీభత్సంపై సీఎంకు చంద్రబాబు లేఖ
    రాష్ట్రంలో వర్ష బీభత్సం వల్ల తలెత్తిన 11 సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు తెదేపా అధినేత చంద్రబాబు 3పేజీల లేఖ రాశారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని కోరారు. దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థిక సాయం అందించటంతో పాటు కూలిపోయిన, కొట్టుకుపోయిన ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు మంజూరు చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • శోభానాయుడు మృతికి చంద్రబాబు సంతాపం
    ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ శోభానాయుడు కన్నుమూశారు. ఆమె మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • దిగ్బంధంలో హైదరాబాద్​.. నిలిచిన రాకపోకలు..
    భారీ వర్షాలతో తెలంగాణలోని హైదరాబాద్​ అతలాకుతలమవుతోంది. ఏ గల్లీ చూసినా నీరే కనిపిస్తోంది. సిటీలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ వర్షం దంచి కొట్టింది. భారీ వర్షంతో జాతీయ రహదారులపై నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బెంగళూరు, వరంగల్, విజయవాడ నుంచి భాగ్యనగరానికి రాకపోకలు నిలిచిపోయాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'హాథ్రస్'పై గురువారం సుప్రీంలో విచారణ
    గురువారం హాథ్రస్​ ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో యూపీ ప్రభుత్వం అఫిడవిట్​ దాఖలు చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనాన్ని కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • సీఎం అభ్యర్థి తేజస్వీ నామినేషన్
    బిహార్​ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘోపుర్​ స్థానం నుంచి పోటీ చేస్తున్న తేజస్వీ యాదవ్​ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు తన తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆశీర్వాదం తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'బైడెన్​ గెలిస్తే వామపక్ష తీవ్రవాదులు రెచ్చిపోతారు'
    కరోనా నుంచి కోలుకున్న డొనాల్డ్​ ట్రంప్​ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ప్రత్యర్థి బైడెన్​పై ప్రచార సభలో​ మరోసారి విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలోనే బైడెన్​ లాంటి 'చెత్త అభ్యర్థి'ని చూడలేదని దుయ్యబట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రీ క్వార్టర్స్​కు లక్ష్యా సేన్​
    డెన్మార్క్​ ఓపెన్​ సూపర్ 750 టోర్నీలో భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్యా సేన్​ శుభారంభం చేశాడు. కరోనా తర్వాత ప్రారంభమైన తొలి బ్యాడ్మింటన్ టోర్నీలో అతడు ప్రీక్వార్టర్స్​కు దూసుకెళ్లాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ధనుష్​, విజయకాంత్​ ఇళ్లకు బాంబు బెదిరింపులు
    కోలీవుడ్​ నటులు విజయకాంత్​, ధనుష్​ ఇళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి పోలీస్​ కంట్రోల్​రూమ్​కు ఫోన్​ చేసి సమాచారం ఇచ్చాడు. అందులో నిజం లేదని తెలుసుకున్న అధికారులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details