ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Sep 23, 2020, 3:03 PM IST

  • ముగిసిన పర్యటన.. నేరుగా తిరుపతికి
    ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల దిల్లీ పర్యటన ముగిసింది. అక్కడి నుంచి నేరుగా సీఎం తిరుపతికి బయల్దేరారు. ఈ రోజు ఉదయం.. కేంద్రమంత్రి అమిత్​షాను సీఎం కలిశారు. అంతకుముందు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​తో భేటీ అయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తీవ్ర ఉద్రిక్తత
    సీఎం జగన్ తిరుపతి పర్యటన నేపథ్యంలో... చిత్తూరులో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెదేపా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'దేవాలయాల జోలికి రావొద్దు'
    రాష్ట్రంలో దేవాలయాలు.. రాజకీయ కబంధ హస్తాల నుంచి బయటికి రావాలని.. స్వామి పరిపూర్ణానంద అన్నారు. దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఆలయాల నిర్వహణలో విఫలమయ్యారని.. ఆయన్ను పదవి నుంచి తొలగించి మరేదైనా పని అప్పగించాలని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మోహినీ అవతారంలో శ్రీవారు
    శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేటి వేడుకలో భాగంగా.. శ్రీవారు మోహినీ అవతారంలో భక్తులను అనుగ్రహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వేడుకను అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నిరవధిక వాయిదా
    రాజ్యసభ వర్షాకాల సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కరోనా భయాల నేపథ్యంలో షెడ్యూల్ కంటే ముందుగానే సమావేశాలు ముగిశాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులకు ఈ సమావేశాల్లో పెద్దల సభ ఆమోదం లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అవి చాలా తక్కువ!
    కరోనా వైరస్ సంక్రమించిన వారిలో లక్షణాలు లేని కేసులు చాలా తక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది. పరీక్షించిన సమయంలో కరోనా పాజిటివ్​గా తేలినా.. ఏదో ఓ సమయంలో లక్షణాలు కనిపించే అవకాశం లేకపోలేదని అంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'డిమాండ్ లేదు'
    రుణాల పునర్​వ్యవస్థీకరణ సదుపాయం వినియోగించుకునేందుకు.. మార్కెట్ వర్గాలు అంచనా వేసినంత డిమాండ్ లేదని ఎస్​బీఐ ఛైర్మన్ వెల్లడించారు. రుణాల పునర్​వ్యవస్థీకరణ ప్రస్తుతం రూ.25 కోట్ల కన్నా ఎక్కువ.. రూ.400 కోట్లకన్నా తక్కువ రుణాలు ఉన్న కార్పొరేట్లు మాత్రమే ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ధోనీ కెప్టెన్సీపై గంభీర్​ విమర్శలు
    ధోనీని విమర్శించిన మాజీ క్రికెటర్ గంభీర్.. జట్టును ముందుండి నడిపించాలని అభిప్రాయపడ్డాడు. టాప్​ ఆర్డర్​లో బ్యాటింగ్​ చేసి కుర్రాళ్లకు ప్రేరణగా నిలవాలని సూచించాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మోదీ, పిచాయ్​ల సరసన​ హీరో
    టైమ్​ మ్యాగ్​జైన్​ 100 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో బాలీవుడ్​ నటుడు ఆయుష్మాన్​ ఖురానా చోటు దక్కించుకున్నాడు. ప్రధాని మోదీ, గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్​ల సరసన చేరాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details