ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

ప్రధాన వార్తలు @ 3PM
ప్రధాన వార్తలు @ 3PM

By

Published : Aug 19, 2020, 3:14 PM IST

  • పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీం విచారణ వాయిదా
    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో బెంచ్‌కి పంపాలని జస్టిస్ ఆర్‌.ఎఫ్‌.నారీమన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేయగా.. తాజాగా ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు
    అనంతపురం జిల్లాలో ట్రంకు పెట్టెల్లో నిధులు దాచిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఓ ఇంట్లో ఆయుధాలు దాచిపెట్టారనే సమాచారంతో తనిఖీలకు వెళ్లిన పోలీసులకు... 8 పెట్టెల్లో 2.4 కిలోల బంగారం, 84 కిలోల వెండి, రూ.15.55 లక్షలు లభించటం కలకలం రేపుతోంది. అవన్నీ జిల్లా కేంద్రంలోని ట్రెజరీ ఉద్యోగి మనోజ్‌కు చెందినవిగా ప్రాథమిక విచారణలో పోలీసులు నిర్ధరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • దేశ రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతి
    దేశ రాజకీయ చిత్రపటంలో ఏపీ రాజధానిగా అమరావతిని చేర్చినట్లు సర్వే ఆఫ్ ఇండియా పేర్కొంది. 2019 నవంబర్‌ 21న లోక్‌సభ శూన్యగంటలో అమరావతి అంశాన్ని గల్లా జయదేవ్‌ లేవనెత్తగా.. నిన్న సర్వే ఆఫ్ ఇండియా ఆయనకు సమాధానం పంపింది. ఆంగ్లం 9వ ఎడిషన్ 2019, హిందీ 6వ ఎడిషన్ 2020లో ఈ విషయాన్ని పొందుపరిచినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • ఆ నగరంలో 50% మందికిపైగా కరోనా!
    పుణేలో దాదాపు 50 శాతం మందికిపైగా కరోనా సోకి ఉండొచ్చని ఓ సర్వే వెల్లడించింది. వైరస్​ ప్రభావం ఎక్కువగా ఉన్న 5 ప్రాంతాల్లో జరిపిన పరీక్షల్లో 50 శాతానికిపైగా మందిలో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు తయరైనట్లు తేలింది. అయితే అందులో చాలా మందికి కరోనా సోకిన విషయం కూడా తెలియదని సర్వే పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • 'నేను సంతోషంగా లేను.. అందుకే చంపేస్తున్నా'
    మహారాష్ట్రలో విషాద ఘటన జరిగింది. భర్త, ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది ఓ వైద్యురాలు. తన జీవితం ఆనందంగా లేనందువల్లే ఇలా చేస్తున్నట్లు సుష్మ సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • కరోనా కట్టడిలో సహకారంపై భారత్​-బంగ్లా చర్చ
    కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ.. బంగ్లాదేశ్​లో రెండురోజుల పర్యటనకు వెళ్లారు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్​ ష్రింగ్లా. ఇందులో భాగంగా ఆ దేశ ప్రధాని షేక్​ హసీనాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కరోనా కట్టడికి సహకారం, కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సహా కీలక విషయాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • టాయిలెట్​లోనూ మాస్క్ తప్పనిసరి.. లేదంటే...
    కరోనా మహమ్మారి వ్యాప్తికి కాదేది అనర్హం అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. పబ్లిక్​ యూరినల్స్ ఫ్లష్​ చేసినా వైరస్ కణాలు గాలి ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు చైనా పరిశోధకులు తాజాగా వెల్లడించారు. మూత్రశాలలకు వెళ్లినా మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • ఈ-కామర్స్​ విస్తరణకు రిలయన్స్ దూకుడు
    ఇటీవల భారీగా పెట్టుబడులను ఆకర్షించిన రిలయన్స్ ఇండస్ట్రీస్​.. ఇప్పుడు ఈ-కామర్స్ వ్యాపారాల విస్తరణలో దూకుడు పెంచింది. ఇందుకోసం మార్కెట్లో ఆన్​లైన్​ రిటైల్ సేవలందిస్తున్న సంస్థల కొనుగోలుకు చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా 'నెట్​మెడ్స్​' అనే ఆన్​లైన్ ఫార్మా సంస్థను రూ.620 కోట్లతో స్వాధీనం చేసుకుంది. దీనితో ఇతర రంగాల్లోని సంస్థల కొనుగోలుపై అంచనాలు భారీగా పెరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • ఐపీఎల్​ స్పాన్సర్​గా 'డ్రీమ్​ 11'కు కొత్త చిక్కులు​..?
    ఐపీఎల్‌-2020 స్పాన్సర్‌షిప్​ కోసం భారీగా బిడ్​ వేసిన డ్రీమ్​ ఎలెవన్​కు ఓ చిక్కొచ్చి పడింది. 2021, 2022లో జరగనున్న మెగాటోర్నీ కోసం ఈ సంస్థ ఎంత కండిషనల్​ అమౌంట్ చెల్లిస్తుందో చెప్పాలని బీసీసీఐ కోరింది. ఈ ఏడాది వేసిన రూ.222 కోట్ల మొత్తమే చెల్లిస్తే.. రానున్న రెండు ఐపీఎల్లో​ స్పాన్సర్​గా కొనసాగేందుకు వీలుండదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
  • 'పీపీఈ కిట్ల కోసం పెయింటింగ్స్​ వేలం'
    మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్​ తనలోని మానవతా దృక్పథాన్ని చాటుకుంది. కరోనాపై పోరాటం చేస్తున్న ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. తాను వేసిన పెయింటింగ్స్​ను అమ్మి.. వచ్చిన సొమ్ముతో వారికి పీపీఈ కిట్లు అందజేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details