fan gift to his favorite director: తన అభిమాన దర్శకుడికి మంచి బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో... సూక్ష్మరూపంలో ఆయన నిర్మించిన సినిమా టైటిల్‌ను తయారు చేశాడు అనంతపురానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు సంస్థలో త్రిడీ యానిమేటర్‌గా పనిచేస్తున్న ఈ యువకుడికి డైరెక్టర్ రాజమౌళి అంటే ఇష్టం. ఆ అభిమానంతో... 'ఆర్ఆర్ఆర్' సినిమా టైటిల్, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ల రూపాల్ని మైక్రో ఆర్ట్‌లో రూపొందించాడు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటునే... నాలుగు నెలలు రాత్రి సమయంలో ఎంతో శ్రమించి దీన్ని తయారు చేశానని అంటున్నాడు.
సూక్ష్మరూపంలో RRR సినిమా పేరు.. ఎవరికోసమో తెలుసా? - సూక్ష్మరూపంలో సినిమా పేరు తయారు చేసి అభిమానాన్ని చాటుకున్న ఆర్టిస్ట్
fan gift to his favorite director: తమ అభిమాన హీరోల కోసం పచ్చబొట్టు వేయించుకుంటారు కొందరు... తమకు ఇష్టమైన వస్తువులను బహుమతులుగా ఇస్తారు ఇంకొందరు... ఇంకాస్త ముందుకెళ్లి తమ అభిమానాన్ని చాటుకునేందుకు గుండెలపై హీరోల బొమ్మలనూ అచ్చేయించుకుంటారు మరికొందరు... అయితే అందుకు భిన్నంగా ఆలోచించాడు ఓ యువకుడు... తన అభిమాన దర్శకుడికి బహుమతి ఇవ్వాలని ఆలోచించి... ఏకంగా ఆయన రూపొందించిన సినిమాను పేరు, అందులో నటించిన హీరోల రూపాలను సూక్ష్మరూపంలో తయారు చేశాడు... ఇంతకీ ఎలాగంటే..?
"మీ అందరికీ తెలుసు... 25న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలవుతుందని. నాకు రాజమౌళి సర్ అంటే చాలా ఇష్టం. ఆయన రూపొందించిన ప్రతి మూవీకి నేను ఏదో ఒక మైక్రో ఆర్ట్ చేస్తూ వచ్చాను. చిన్నప్పటి నుంచి నేను మైక్రో ఆర్ట్ చేస్తూ వచ్చాను.ఒక స్టేజ్ రాగానే రాజమౌళి సర్ సినిమాకు వర్క్ చేయాలని నా లైఫ్ ఆంబిషన్. అందుకోసం నేను RRRను మైక్రో ఆర్ట్ రూపంలో ప్రజెంట్ చేశాను. దీని వల్ల నా గోల్ రీచ్ అయినట్లు ఉంటుంది. ఆయన మూవీకి వర్క్ చేసినట్లవుతుందని నేను హ్యాపీగా ఫీలవుతున్నా. " -ప్రవీణ్, మైక్రో ఆర్టిస్ట్
ఇదీ చదవండి:తపించారు.. శ్రమించారు.. చివరకు సాధించారు!!