తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 316 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా రెండు మరణాలు సంభవించాయి. మొత్తం ఇప్పటివరకు 2,81,730 కరోనా కేసులు నమోదుకాగా... కరోనాతో ఇప్పటివరకు 1,515 మంది మృతిచెందారు. వైరస్ నుంచి మరో 612 మంది బాధితులు కోలుకున్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం - Telangana news
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం తాజాగా 316 మందికి వైరస్ సోకగా.. ఇద్దరు మృతి చెందారు. వైరస్ బారి నుంచి ఇప్పటివరకు 2,73,625 మంది కోలుకున్నారు.
తెలంగాణ కరోనా కేసులు
మొత్తం 2,73,625 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,590 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,467 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 86 కరోనా కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చదవండి:'కొత్త వ్యవసాయ చట్టాలతో చిక్కులే... కార్పొరేట్ సంస్థలదే హవా'