ప్రధానవార్తలు
By
Published : Jun 30, 2021, 3:11 PM IST
| Updated : Jun 30, 2021, 3:38 PM IST
- AP cabinet : తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు: సీఎం జగన్
ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చ జరుగుతోంది. మంత్రులతో చర్చలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Jagan Cabinet Decisions: విద్యార్థులకు ల్యాప్టాప్లు.. ఇళ్ల నిర్మాణాలకు భారీగా నిధులు!
జేఎన్టీయూ చట్టం 2008 సవరణకు మంత్రివర్గం అంగీకారాన్ని తెలిపింది. టిడ్ కో ద్వారా 2 లక్షల,62, 216 ఇళ్ల నిర్మాణం పూర్తికి, మౌళిక సదుపాయల కల్పన కోసం, రూ. 5990 కోట్ల మేర బ్యాంకు రుణానికి హామీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- brahmamagari pitham: బ్రహ్మంగారి పీఠంపై తెగని పంచాయితీ.. హైకోర్టుకు చేరిన వివాదం!
కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో కొలిక్కి వచ్చిందనుకుంటున్న పీఠాధిపత్యం వివాదం మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోంది. దివంగత పీఠాధిపతి రెండో భార్య మారుతి మహాలక్ష్మమ్మ పీఠాధిపతి విషయంపై హైకోర్టును ఆశ్రయించింది. పెద్ద మనుషుల మధ్య రాజీ చర్చల్లో బలవంతంగా తమను ఒప్పించారని ఆరోపిస్తూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- COVID VACCINE: రాష్ట్రానికి మరో 6 లక్షల కొవిడ్ టీకా డోసులు
రాష్ట్రానికి కేంద్రం కొత్తగా మరో 6 లక్షల కొవిడ్ టీకా డోసుల్ని పంపించింది. ఈ టీకాలు సీరం సంస్థ, దిల్లీ నుంచి రాష్ట్రానికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్షుద్రపూజల నిందవేసి.. మలం తినిపించి...
ఆధునికత ఎంత వేగంగా విస్తరిస్తున్నప్పటికీ.. మనిషి మూఢ నమ్మకాలను వీడనట్లేదనడానికి నిదర్శనమే ఈ ఘటన. క్షుద్రపూజలు చేస్తున్నారన్న నెపంతో ముగ్గురు వ్యక్తులను తీవ్రంగా కొట్టడమే గాక.. మలం తినిపించిన అమానవీయ ఘటన ఒడిశాలో జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అగ్రరాజ్యానికి వడదెబ్బ- పదుల సంఖ్యలో మృతి
భారీ ఉష్ణోగ్రతలతో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వేడి గాలులు, వడదెబ్బ ధాటికి వాషింగ్టన్, ఒరేగాన్లో ఇప్పటి వరకు పదుల సంఖ్యలో మృతిచెందారు. మంగళవారం పశ్చిమ అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 37 డిగ్రీలు దాటినట్లు అమెరికా వాతావరణ శాఖ తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అందుకే వ్యాక్సిన్ పంపిణీకి బ్రేక్'
కొవాగ్జిన్ టీకా కొనుగోళ్లను బ్రెజిల్ నిలిపేయాలని చూస్తున్నట్లు వస్తున్న వార్తలపై భారత్ బయోటెక్ స్పందించింది. బ్రెజిల్ తమకు ముందస్తు చెల్లింపులు చేయలేదని.. అందుకే కొవాగ్జిన్ టీకా డోసులు పంపిణీ చేయలేదని పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Movie Review: థ్రిల్లింగ్ థ్రిల్లింగ్గా 'కోల్డ్కేస్'!
ఓటీటీలో మరో సినిమా అందుబాటులోకి వచ్చేసింది. థ్రిల్లర్ కథతో తెరకెక్కిన మలయాళ చిత్రం 'కోల్డ్కేస్' ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? అనే విషయాలు తెలియాలంటే ఈ రివ్యూ చదవాల్సిందే. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Last Updated : Jun 30, 2021, 3:38 PM IST