- విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చిన ఘనతే ఆజాద్‌కే దక్కుతుంది: సీఎం జగన్
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మైనారిటీ డే కార్యక్రమం నిర్వహించారు. విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకువచ్చిన ఘనత మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కే దక్కుతుందని సీఎం జగన్ కొనియాడారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'డబ్బులు తీసుకుని పోస్టింగ్ ఇస్తే.... ఇలాంటి ఘటనలే జరుగుతాయ్'
నంద్యాలలో కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి... కఠినంగా శిక్షించాలని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకుని పోలీసులకు పోస్టింగ్ ఇస్తే సలాం లాంటి ఘటనలే జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వంటనూనెల ధరలపై కరోనా ప్రభావం
కరోనా ప్రభావం, భారీగా కురిసిన వర్షాలతో వంటనూనె ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. దేశీయంగా ఏటా పెరుగుతున్న వినియోగానికి తగ్గట్లుగా నూనె ఉత్పత్తి లేకపోవడంతో అధిక శాతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వంటనూనెల ధరల ప్రభావం భారత్‌పై పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బలగాల ఉపసంహరణకు భారత్-చైనా ఓకే
లద్దాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గించేందుకు భారత్-చైనా మధ్య నవంబర్ 6న చుషుల్‌లో జరిగిన చర్చల్లో బలగాల ఉపసంహరణకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎల్ఏసీ.. చైనాకు యుద్ధక్షేత్రం, భారత్‌కు పిక్నిక్ స్పాట్!
వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో భారత్-చైనా మధ్య పైచేయి ఎవరిది అన్న అనుమానం అందరిలోనూ ఉంటుంది. సైనిక సంపత్తి, ఆయుధ వ్యవస్థల విషయానికొస్తే చైనా కన్నా భారత్ కాస్త వెనకంజలో ఉందన్న విషయం వాస్తవమే. కానీ అన్నింటికీ మించి యుద్ధక్షేత్రంలో కావాల్సింది అనుభవం. పరిస్థితులకు అలవాటు పడే స్వభావం. ఇందులో భారత్‌ను కొట్టే సైన్యం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బైడెన్ హయాంలో వలస విధానాల్లో భారీ మార్పులు ?
రసవత్తరంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్... ఏ తరహా విధాన నిర్ణయాలు తీసుకుంటారన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. వలస విధానంలో విప్లవాత్మక మార్పులు తథ్యమని కొందరు వాదిస్తోంటే.. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలన్నింటినీ బైడెన్ అటకెక్కిస్తారని మరికొందరు చెబుతున్నారు. ఇంతకీ బైడెన్ ప్రభుత్వం ఎలాంటి విధానాలు అనుసరించనుంది ? వలసజీవుల జీవితాల్లో ఎటువంటి మార్పులు రానున్నాయి ? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బైడెన్ రాకతో భారత్‌లో తగ్గనున్న పెట్రో ధరలు!
అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు ప్రపంచంతో పాటు భారత్‌పైనా ఎనలేని ప్రభావం చూపిస్తాయి. తాజా ఎన్నికల్లో జో బైడెన్ గెలుపొందడం భారత్‌కు ఓ విషయంలో కలిసొచ్చేలా ఉంది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. బైడెన్ విజయానికి, భారత్‌లో పెట్రోల్ ధరలకు సంబంధం ఏంటంటారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'గంగూలీనే మర్చిపోయావా?'.. రవిశాస్త్రిపై నెటిజన్లు ఫైర్
ఐపీఎల్ విజయవంతంగా నిర్వహించడంపై బీసీసీఐకి చెందిన ఉన్నత అధికారుల పేర్లను ప్రస్తావిస్తూ, వారికి ధన్యవాదాలు తెలిపాడు టీమ్ఇండియా కోచ్ రవిశాస్త్రి. అయితే అందులో బోర్డు అధ్యక్షుడు గంగూలీ పేరు లేకపోవడం వల్ల నెటిజన్లు కోచ్‌పై విరుచుకుపడుతున్నారు. అతడిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ముంబయి అందుకే విజయపథంలో దూసుకెళ్తోంది'
రెండేళ్ల క్రితం తమ జట్టు బౌలర్ రషీద్ ఖాన్‌ను ట్రేడిండ్ ద్వారా పొందటానికి ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ ప్రయత్నించిందని తెలిపాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ. ఇతర జట్ల ఆటగాళ్లను ఈ పద్ధతి ద్వారా కొనుగోలు చేసే ధైర్యం ముంబయికి మాత్రమే ఉందన్నాడు. అందుకే విజయవంతమైన జట్టుగా నిలిచిందని ప్రశంసించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్: మొక్కలు నాటిన 'ఆర్ఆర్ఆర్' టీమ్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు ప్రముఖ దర్శకుడు రాజమౌళి. రామ్ చరణ్ విసిరిన సవాల్ స్వీకరించి 'ఆర్ఆర్ఆర్' చిత్రబృందం చేత మొక్కలు నాటించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.