ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3pm

.

3 pm top news
ప్రధాన వార్తలు @ 3pm

By

Published : Jul 13, 2020, 3:01 PM IST

  • అభద్రతా భావం పెరిగింది..
    రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చూస్తుంటే ఆందోళన కలుగుతుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తమకేదైనా ఆపద వస్తే ఆదుకుంటామన్న భరోసాను ప్రభుత్వం ప్రజల్లో నింపలేకపోయిందని విమర్శించారు. కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • వైద్య కళాశాల ఏర్పాటే లక్ష్యం
    రాష్ట్రంలో ప్రతి పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించనున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఎటువంటి లోటు కలగనివ్వటం లేదు'
    రాష్ట్ర ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలకు ఎటువంటి లోటు లేకుండా ముఖ్యమంత్రి జగన్... సమర్ధవంతంగా అమలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'బదిలీ చేసినందుకు బాధ లేదు'
    ఆర్టీసీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశానని ఆర్టీసీ మాజీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ అన్నారు. సంస్థ అభివృద్ధి కోసం ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పని చేశానని అన్నారు. ఆర్టీసీలో డిజిటల్ చెల్లింపుల విషయంపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • పూర్తికాలం మా ప్రభుత్వమే
    రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్​ను నమ్మి ఒటేశారని, వారి నమ్మకాన్ని పార్టీ ఎమ్మెల్యేలు వారి వమ్ము చేయకుండా సీఎల్పీ భేటీకి హాజరుకావాలన్నారు. సీనియర్​ నేత రణదీప్ సుర్జేవాలా. రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిపై అధిష్ఠానం గత రెండు రోజుల్లో అనేక సార్లు సచిన్​ పైలట్​తో మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • సైకిల్ కోసం నిప్పంటించుకున్న యువకుడు
    క్షణికావేశం ఎంత అనర్థం తెస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించిన ఓ ఘటన తమిళనాడు అంబూర్ పట్టణంలో జరిగింది. తన ద్విచక్రవాహనాన్ని పోలీసులు సీజ్​ చేశారన్న ఉక్రోషంతో ఓ యువకుడు తనకు తానే నిప్పుపెట్టుకున్నాడు. దీనితో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • ఇప్పుడు రూ.75/- మాత్రమే!
    కరోనా మహమ్మారిని ఇప్పుడు మరింత తక్కువ ధరకే తరిమేయొచ్చు. తొలిదశ లక్షణాలతో బాధపడే కరోనా రోగుల్లో వైరస్​ను అంతం చేసేందుకు ఉపయోగిస్తున్న ఫాబిప్లూ ఔషధాన్ని ఇప్పుడు 75 రూపాయలకే అందిస్తోంది గ్లెన్​మార్క్​ ఫార్మా. తొలుత అందుబాటులోకి తెచ్చిన ధరపై ఏకంగా 27 శాతం తగ్గించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 2021 నాటికైనా వ్యాక్సిన్‌ వచ్చేనా?
    కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్​ను కట్టడి చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్​ ఒక్కటే మార్గం. అయితే ఇప్పట్లో కొవిడ్​కు శాశ్వత టీకా రావడం కష్టమేనని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • 'కోహ్లీ చెప్పాకే బాధ్యతలు అందుకున్నా'
    2017లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో కెప్టెన్సీ చేయడం ప్రత్యేకమని చెప్పిన రహానె.. తన జీవితంలో ఆరోజు ఎంతో ప్రత్యేకమని తెలిపాడు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాల్ని పంచుకున్నాడు.మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
  • అండగా సోనూసూద్
    కరోనాతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న 400 పేద కుటుంబాలను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు నటుడు సోనూసూద్. ఇప్పటికే పలు రాష్ట్రాల అధికారులతో మాట్లాడి వారి చిరునామాలు, బ్యాంకు ఖాతాలను సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details