AP corona cases: రాష్ట్రంలో కొత్తగా 2,527 కరోనా కేసులు, 19 మరణాలు - AP CORONA CASES
17:07 July 21
today ap corona cases
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 86,280 పరీక్షలు నిర్వహించగా.. 2,527 కేసులు నిర్ధారణ అయ్యాయి. ఫలితంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 19,43,854 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్ వల్ల 19 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,197కి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,412 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,06,718కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 23,939 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా, నెల్లూరులో జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. ఉభయగోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:
AP RAINS: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు