రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు..10 మరణాలు - total corona cases in ap
16:01 November 04
రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు..10 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,33,208కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,744 గా ఉంది. కొవిడ్ బారిన పడి మరో 2,701 మంది కోలుకోగా... మొత్తం బాధితుల సంఖ్య 8.05 లక్షల మందిగా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,438 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 83.42 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్ లో పేర్కొంది.
ఇదీ చదవండి