తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 1,81,627కు చేరింది. కొత్తగా 2,381 కరోనా కేసులు, 10 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి బారిన పడి 1,080 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 386 కరోనా కేసులు నమోదయ్యాయి.
కొవిడ్ నుంచి మరో 2,021 మంది బాధితులు బయటపడగా... ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 1,50,160కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,387 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు తెలిపారు. హోం ఐసోలేషన్‌లో 24,592 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.