- గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్
రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్‌ను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కలిశారు. పంచాయతీ ఎన్నికల విషయమై గవర్నర్‌తో చర్చించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వ్యాక్సినేషన్‌కు చకచకా ఏర్పాట్లు.. కాసేపట్లో రాష్ట్రానికి డోసులు
ఈ నెల 16న నిర్వహించే కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు వైద్య అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలిదశలో 3.87 లక్షల మంది వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. కాసేపట్లో ఈ డోసులు గన్నవరం విమానాశ్రయానికి రానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రత్యేక బృందాలను దింపాం: పశ్చిమ గోదావరి ఎస్పీ
పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు, జూదాలను పూర్తిగా నియంత్రిస్తామమని జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ అన్నారు. ఆదాయపన్ను అధికారులను సైతం రంగంలోకి దింపినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తిరుమలలో అన్యమత ప్రచారం.. వ్యక్తిని విచారించిన అధికారులు!
తిరుమలలో అన్యమత ప్రచారానికి పాల్పడుతున్నాడనే సమాచారం మేరకు ఓ వ్యక్తిని తితిదే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ వ్యక్తి వద్ద లిఖితపూర్వకంగా వివరణ తీసుకుని విడిచిపెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లింది- యువత రావాలి'
జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దేశంలోని యువతను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించారు. స్వామి వివేకానంద చెప్పిన మాటలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వివేకుడి సైకత శిల్పం- నవభారతానికి ఉక్కు సంకల్పం