- Godavari Floods: ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక.. ముంపు బారిన లంకలు..
Dhavaleswaram flood: గోదావరి నదికి రెండోసారి వరద పోటెత్తడంతో కోనసీమ జిల్లాలోని లోతట్టు కాజ్వేలు ముంపు బారిన పడుతున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. సముద్రంలోకి 13.59 లక్షల క్యూసెక్కుల వరదనీటిని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తోబుట్టువుల క్షేమమే.. 'రాఖీ' పరమార్థం: బాలకృష్ణ
HERO BALAKRISHNA: అన్నా చెల్లెళ్ల అనురాగానికి చిహ్నం రాఖీ పండుగ అని నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. తోబుట్టువుల క్షేమమే రాఖీ పండుగ పరమార్థం అని గుర్తుచేశారు. మహిళాభ్యున్నతికి తోడ్పడటమే మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Nagarjuna sagar : నిండు కుండల్లా జలాశయాలు.. సాగర్ 20 గేట్లు ఎత్తిన అధికారులు..
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. సాగర్ 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. వరద ఇలాగే కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తెలంగాణలో 'బాహుబలి' జలపాతం.. చూపు తిప్పుకోనివ్వని జలదృశ్యం..
Bogatha Waterfalls: తెలంగాణ నయాగరా.. బొగత జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తోంది. బొగత అద్భుత జల దృశ్యాలు.. "బాహుబలి" సినిమాలోని జలపాతాన్ని తలపిస్తున్నాయని టూరిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేసిన ధన్‌ఖడ్
Vice President oath ceremony: భారత 14వ ఉపరాష్ట్రపతిగా ప్రమాణం చేశారు జగదీప్ ధన్‌ఖడ్. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము.. ధన్‌ఖడ్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, లోక్‌సభ స్పీకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉరీ తరహా ఉగ్రదాడికి భారీ కుట్ర.. ఇద్దరు ముష్కరులు హతం.. ముగ్గురు జవాన్ల వీరమరణం
సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడికి యత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. ఈ క్రమంలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరో ముగ్గురు గాయపడ్డారు. జమ్ముకశ్మీర్ రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలోని ఆర్మీ క్యాంప్ వద్ద గురువారం ఉదయం జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐరాస వేదికగా చైనా 'ఉగ్ర' కుట్రలు.. మసూద్ అజార్ సోదరుడికి అండ!
UNSC China India : పాకిస్థాన్ కోసం మరోమారు ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించింది చైనా. జైషే మహ్మద్ ముష్కరుడిపై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసి, ఆంక్షలు విధించాలన్న భారత్, అమెరికా ప్రయత్నాలకు మోకాలడ్డింది. ఆంక్షలు విధించేందుకు ఐరాస భద్రతా మండలిలోని 14 దేశాలు అంగీకరించినా.. చైనా మాత్రం ఈ ప్రతిపాదన అమలు వాయిదా పడేలా చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కామన్వెల్త్లో మిస్సింగ్ కలకలం.. మొన్న 10 మంది.. ఇప్పుడు మరో ఇద్దరు
ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్న పది మంది శ్రీలంక సభ్యులు అదృశ్యమవ్వగా.. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన మరో ఇద్దరు బాక్సర్లు కూడా మిస్ అయ్యారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Liger: మైక్ టైసన్‌కు మైండ్ బ్లాక్ రెమ్యునరేషన్.. విజయ్‌కు ఎంతంటే?
Vijaydevarkonda Liger movie remuneration: సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమా 'లైగర్'. భారీ అంచనాలతో ఈ నెలలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 1 PM