ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 8, 2022, 12:58 PM IST

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

  • Godavari Floods: నిలువ నీడ కూలిపోయే.. నడిరోడ్డే దిక్కాయే
    Godavari Floods: కూలిన ఇళ్లు, విసిరేసినట్లు పడున్న పైకప్పులు, పేరుకున్న బురద.. ఇవీ ఆదివాసీ గ్రామాల్లో గోదావరి వరద సృష్టించిన బీభత్సం. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఊళ్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడి దృశ్యాలను చూసి కన్నీటిపర్యంతం అవుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Constable murder: పోలీస్ కానిస్టేబుల్ దారుణహత్య.. ఎక్కడంటే..?
    Constable murder: నంద్యాలలో పోలీస్ కానిస్టేబుల్ దారుణహత్యకు గురయ్యారు. దుండగులు కానిస్టేబుల్‌ను కత్తులతో దాడి చేసి హతమార్చారు. మృతుడు సురేంద్ర.. నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించేవారు. కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తుండగా.. మధ్యలో కొందరు ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి.. హత్య చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Raipur Express: సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ 3 రోజులు రద్దు
    Secunderabad-Raipur Express cancelled: సికింద్రాబాద్‌-రాయ్‌పుర్‌ ఎక్స్‌ప్రెస్‌ను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ డివిజన్‌లో జరుగుతున్న రైల్వే పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పరవాడ పారిశ్రామిక పార్కులో అగ్ని ప్రమాదం.. ఇద్దరికి గాయాలు
    fire accident in parawada: అనకాపల్లి జిల్లా పరవాడ ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫెర్రో కెమికల్స్ పరిశ్రమలో మంటలు చెలరేగడంతో.. ఆయిల్‌ ట్యాంకర్‌ దగ్ధమైంది. మంటల్ని అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా.. కేజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వెంకయ్య సాక్షిగా అనేక చారిత్రక ఘటనలు.. ఆయన దక్షతకు జోహార్లు'
    ఉపరాష్ట్రపతి పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న వెంకయ్య నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య సమక్షంలో సభలో అనేక చారిత్రక ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అయితే, దేశ ప్రజలకు వెంకయ్య నాయుడి అనుభవాల నుంచి నేర్చుకునే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహిళల ముందు అసభ్య ప్రవర్తన.. 'అవి' చూపించాడని రహస్య భాగాలపై పెట్రోల్ పోసి..
    మహిళల ముందు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ వ్యక్తి ప్రైవేట్ భాగాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బ్యాంకు ఖాతాలోకి రూ.6,833 కోట్లు.. అధికారుల మౌనం!.. ఇప్పటికీ అకౌంట్లోనే డబ్బు
    ఓ వ్యక్తి ఖాతాలోకి రూ.6వేల కోట్లకు పైగా నగదు క్రెడిట్ అయింది. ఈ డబ్బు ఎలా వచ్చిందో? ఎవరు పంపించారో తెలీదు! వారం క్రితం డబ్బులు వచ్చినట్లు తెలుస్తుండగా.. ఇప్పటికీ నగదు ఆ ఖాతాలోనే ఉంది. అసలేమైంది? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్థిరంగా బంగారం.. స్వల్పంగా పెరిగిన వెండి.. ప్రస్తుత ధరలివే
    Gold Price Today: దేశంలో బంగారం ధర స్థిరంగా ఉంది. వెండి ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CWG 2022: అమ్మాయిల ఫైనల్‌ మ్యాచ్​.. రోహిత్​సేన చేసిన పనికి ఫ్యాన్స్​ షాక్​!
    కామన్వెల్త్​ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించిన భారత మహిళల క్రికెట్​ జట్టు​.. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్‌ వరకు అద్భుత ప్రదర్శనను కనబరిచింది. ఫైనల్​లో ఓడినా క్రికెట్‌ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అయితే వీరు తుది పోరు ఆడుతున్న సమయంలో రోహిత్​ సేన చేసిన ఓ పని నెటిజన్లను ఆకర్షించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎన్టీఆర్​, కల్యాణ్​రామ్​ ఘనత.. వీరి చిత్రాలతోనే ఆ స్టార్​ డైరెక్టర్ల కెరీర్​ షురూ!
    టాలీవుడ్​లో నందమూరి హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కల్యాణ్​రామ్​ ఓ ఘనతను అందుకున్నారు. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details