ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 28, 2022, 12:58 PM IST

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

  • విశాఖ అక్కయ్యపాలెం వద్ద తెదేపా-వైకాపా మధ్య ఘర్షణ
    విశాఖలో తెదేపా-వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 26వ వార్డులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో గొడవ మొదలైంది. రూ.కోటి 53 లక్షల విలువైన జీవీఎంసీ అభివృద్ధి పనులకు సంబంధించి... ఇవాళ అక్కయ్యపాలెంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శంకుస్థాపనకు జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారి, నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వైకాపా కార్పొరేటర్లు హాజరయ్యారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆర్థిక సమస్యలతో విద్యార్థిని ఆత్మహత్య
    ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. రైతుపేటలో జాస్తి హరిత వర్షిణి విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వర్షిణి ఈఏపీసెట్‌లో 15 వేల ర్యాంకు సాధించింది. బాలిక తండ్రి ప్రభాకర్‌రావు దిల్లీలో ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • టీచ‌ర్లపై క‌క్ష - విద్యార్థుల‌కు శిక్ష.. ఇది వైకాపా ప్రభుత్వ విద్యావిధానం: లోకేశ్‌
    LOKESH ON EDUCATION SYSYTEM : టీచ‌ర్లపై క‌క్ష-విద్యార్థుల‌కు శిక్ష.. ఇది వైకాపా ప్రభుత్వ విద్యావిధానం అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. 117, 128, 84, 85జీవోల‌తో విద్యావ్యవ‌స్థ అస్తవ్యస్తంగా మారిందని దుయ్యబట్టారు. ఈ జీవోలతో ఉపాధ్యాయులు గంద‌ర‌గోళంలో ఉంటే..విద్యార్థులు ఆందోళ‌న‌లో ఉన్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు
    హైదరాబాద్​ క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అధీర్' వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం.. మరో ముగ్గురు ఎంపీలపై వేటు​
    BJP Mps Protest: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్‌ లోక్‌సభాపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరీ చేసిన వ్యాఖ్యలపై ఉభయసభల్లో తీవ్ర దుమారం రేగింది. రాష్ట్రపతిని కించపరిచేలా వ్యాఖ్యానించిందుకు కాంగ్రెస్‌ పార్టీ క్షమాపణ చెప్పాలంటూ భాజపా ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేపట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కుక్కను మింగేసిన 13 అడుగుల పైథాన్​.. ఏనుగు హల్​చల్​..!
    రాజస్థాన్​ కోటాలో 13 అడుగుల పైథాన్ హల్​చల్ చేసింది. థర్మల్ కాంప్లెక్స్ సమీపంలో ఓ కుక్కను మింగేసింది. అనంతరం పాము అడవిలోకి వెళ్లిపోయింది. మరోవైపు, కర్ణాటక చామరాజనగర్​లోని మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలోకి ఓ ఏనుగు ప్రవేశించి బీభత్సం సృష్టించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జలపాతం వద్ద పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన ముగ్గురు మహిళలు!
    తమిళనాడు.. తెన్​కాశిలో ఉన్న కుర్తాళం జలపాతం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. గత కొద్దిరోజులుగా కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. అక్కడే ఉన్న ముగ్గురు మహిళలు నీటిలో కొట్టుకుపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతో తెలుసా?
    Gold Price Today: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆసియా కప్​ వేదిక మార్పు.. ఎక్కడంటే?
    Asia cup 2022: ఆసియా కప్​ నిర్వహణపై ఏషియన్​ క్రికెట్​ కౌన్సిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో వేదికను యూఏఈకి తరలిస్తున్నట్లు అధ్యక్షుడు జైషా పేర్కొన్నారు. ప్రపంచకప్​ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసియా జట్లకు ఈ టోర్నీ కీలకంగా మారనుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • "ఇంద్ర సినిమా వల్లే అది సాధ్యమైంది.. లేదంటే..'
    Chiranjeevi Indra movie: బ్లాక్‌బస్టర్‌ సినిమా 'ఇంద్ర'లో తాను నటించకపోవడానికి గల కారణాన్ని చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ . ఆ సినిమా సమయంలో జరిగిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. ఆ విశేషాలివీ.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details