- కోడికత్తి కేసు.. సీజేఐకి లేఖ రాసిన నిందితుడి తల్లి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
- తెలుగు రాష్ట్రాల్లో రెండురోజులపాటు వానలు
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నైరుతీ రుతుపవనాలు అత్యంత క్రియాశీలకంగా మారినట్టు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా - కోస్తాంధ్ర తీరం వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు పేర్కొంది.
- ఆ అయిదు లక్షణాలు ఉన్న వారికే బ్లాక్‌ఫంగస్..
కరోనా మరోసారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ మహమ్మారి సోకిన వారు కోలుకున్న తర్వాత కూడా బాధితులను ముప్పు తిప్పు పెడుతోంది. ముఖ్యంగా కొవిడ్ బారిన పడి కోలుకున్న చాలా మందిలో బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బయటపడింది. అయితే ఈ ముప్పు ఎవరిలో ఎక్కువగా ఉంటుందనే విషయంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యుల బృందం అధ్యయనం చేసింది.
- పులి జాడ దొరికింది.. ట్రాప్ కెమెరాల్లో నమోదైన చిత్రాలు
అనకాపల్లి జిల్లాలో గత 15రోజులుగా ఎవరికీ కంటి మీద కునుకు పట్టనీయకుండా తిరుగుతున్న పెద్దపులి జాడను.. అటవీ అధికారులు కనుగొన్నారు. కశింకోట మండలం విస్సన్నపేటలో రైతు గవిరెడ్డి వెంకటరమణకి చెందిన గేదెపెయ్యను బుధవారం పులి చంపిన విషయం తెలిసిందే.
- అమర్నాథ్ వరదల్లో 16కు మృతులు.. రంగంలోకి ఆర్మీ చాపర్లు
అమర్నాథ్ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 16కు పెరిగింది. పలువురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ క్షేత్రానికి సమీపంలో శుక్రవారం అకస్మాత్తుగా వరద బీభత్సం సృష్టించింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో వరద పోటెత్తింది.
- దూసుకెళ్లిన ట్రక్.. ఇంటి బయట నిద్రిస్తున్న ఆరుగురు మృతి
పికప్ ట్రక్ అదుపు తప్పి రోడ్డు పక్కనే నిద్రిస్తున్న ఏడుగురి పైనుంచి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
- టోక్యోకు షింజో అబే భౌతికకాయం.. సంచలనాలు వెల్లడించిన హంతకుడు!
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మృతదేహాన్ని టోక్యోకు తరలించారు. నేతలు, ప్రజల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని అబే నివాసానికి తీసుకొచ్చారు. మరోవైపు, హత్య చేసిన నిందితుడి నుంచి పోలీసులు పలు విషయాలు రాబట్టారు.
- స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. నేటి లెక్కలు ఇలా..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.150 పెరిగి.. ప్రస్తుతం రూ.52,630 వద్ద ఉంది. కిలో వెండి ధర రూ.250 పెరిగి రూ.58,420 వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- లండన్ వీధుల్లో 'దాదా' చిందులు..
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తన 50వ పుట్టినరోజు వేడుకలను లండన్‌లో ఘనంగా జరుపుకున్నాడు. అక్కడి వీధుల్లో కుటుంబం, మిత్రులతో కలిసి పలు హిట్ సాంగ్‌లకు చిందులేస్తూ ఎంజాయ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.
- మహేశ్-త్రివిక్రమ్ మూవీ.. అప్డేట్ వచ్చేసింది..
మహేశ్‌బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందనున్న సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడెక్షన్ పనులు జరుగుతున్నాయని, ఆగస్టు నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.