- JAGAN TRIBUTES: వైఎస్ ఘాట్ వద్ద నివాళులు.. పలకరించుకోని జగన్, షర్మిల
JAGAN TRIBUTES: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. కుటుంబసభ్యులు ఆయనకు అంజలి ఘటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- PAWAN TWEET: 'నవరత్నాలపై.. నవసందేహాలు'.. పవన్ ట్వీట్
PAWAN TWEET: వైకాపా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న ప్లీనరీ సమావేశాల సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నవసందేహాల పేరిట ట్వీట్ చేశారు. వైకాపా ప్రభుత్వం ప్రధాన అంశాలుగాపేర్కొంటున్న నవరత్నాలపై విడివిడిగా తన సందేహాలను ట్వీట్‌లో పొందుపరిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CBN TOUR: 'ఓట్ల బాధ్యత మీది.. మీ భవిష్యత్‌కు భరోసా నాది'
CBN REVIEW MEETING: నాయకులంతా ఏకతాటిపై పని చేయాలని.. విభేదాలతో పార్టీకి నష్టం వాటిల్లేలా వ్యవహరిస్తే సహించేదిలేదని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రేణులను హెచ్చరించారు. కడప, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులుగా శ్రీనివాసుల రెడ్డి, గంటా నరహరిని ప్రకటించిన ఆయన.. కార్యకర్తలు వారికి సహకరించాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పోలీస్ అభ్యర్థులకు అలెర్ట్.. నెగెటివ్ మార్కులు ఉన్నాయి జాగ్రత్త..!
వేలల్లో పోస్టులు.. లక్షల్లో అభ్యర్థులు.. ఒక్కో పోస్టుకు వందల్లో పోటీదారులు.. పోలీస్ నియామక ప్రక్రియలో నెలకొన్న తాజా పరిణామమిది. తెలంగాణ పోలీస్‌శాఖలో భారీ నోటిఫికేషన్‌లో భాగంగా పోలీసుల ఎంపికకు ప్రాథమిక రాతపరీక్ష (పీడబ్ల్యూటీ)కు నియామక మండలి తేదీలు ఖరారు చేయడంతో అభ్యర్థులు సన్నద్ధతలో వేగం పెంచారు. అయితే గతానికి భిన్నంగా ఈసారి తప్పుడు సమాధానాలకు నెగెటివ్ మార్కులు వేయనుండటంతో వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. ఆరుగురు దుర్మరణం
Road Accident: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. చెంగల్పట్టు ప్రాంతంలో ఆగి ఉన్న ఇనుప లోడ్ లారీని బస్సు ఢీకొట్టింది. శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో 15 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్నేహం ప్రూవ్ చేసుకోవాలని కాలువలోకి దూకిన ముగ్గురు.. చివరకు..
Friends Jumped In Canal: మద్యం మత్తులో ముగ్గురు ప్రాణ స్నేహితులు.. తమ స్నేహ బంధాన్ని నిరూపించుకోవడానికి నీటి కాలువలోకి దూకారు. వెంటనే గమనించిన స్థానికులు ఒకరిని కాపాడగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ ఘటన హరియాణాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- షింజో అబేపై కాల్పులు జరిపింది ఇతడే!
Shinzo Abe Shot: ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తుండగా కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన జపాన్ మాజీ ప్రధాని షింజే అబే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులు జరిపిన వ్యక్తిని ఘటనాస్థలిలోనే అరెస్ట్ చేశారు పోలీసులు. అతడు మారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ మాజీ ఉద్యోగి అని జపాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏపీ, తెలంగాణలో.. బంగారం, వెండి ధరలు ఎంతంటే?
Gold Price Today: బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విండీస్‌తో టీ20లకూ విరాట్ దూరం.. పంత్, బుమ్రా, హార్దిక్ అనుమానమే!
Kohli miss Westindies tour: వెస్టిండీస్‌తో ఇప్పటికే వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ.. ఇప్పుడు టీ20 సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండడని తెలిసింది. పూర్తి పర్యటనకు దూరం కానున్నాడట. విరాట్ విశ్రాంతి కోరడం వల్ల సెలక్టర్లు అతడు పేరును పరిగణనలోకి తీసుకోవట్లేదని సమాచారం. ఇక పంత్, బుమ్రా, హార్దిక్ పాండ్య కూడా అందుబాటులో ఉండటం అనుమానంగానే ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాకిస్థాన్‌లో అడివిశేష్ 'మేజర్' రికార్డు.. ఆ జాబితాలో అగ్రస్థానం
Major movie record: యువ హీరో అడివిశేష్ నటించిన 'మేజర్' సినిమా ఇటీవలే విడుదలై ప్రశంసలను అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ ముందు మంచి వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడీ చిత్రం పాకిస్థాన్‌లో ఓ రికార్డు సృష్టించింది. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.