ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 10, 2022, 12:55 PM IST

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM

  • వైకాపా నేత‌ల‌పై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు.. సీఐడీ అదనపు డీజీపీకి వర్ల ఫిర్యాదు..!
    VARLA COMPLIANT TO CID ADGP: రెండు రాజకీయ పార్టీల మధ్య గొడవలు పెట్టేందుకే వైకాపా నాయకులు.. లోకేష్ జూమ్ మీటింగ్‌లోకి వచ్చారంటూ సీఐడీ అదనపు డీజీపీకి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వైకాపా నేత‌ల‌పై మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • TDP leaders house arrest: అన్న క్యాంటీన్లు ప్రారంభించకుండా తెదేపా నేతల గృహనిర్భంధాలు
    TDP leaders house arrest: బాలకృష్ణ జన్మదిన వేడుకలు నిర్వహించకుండా.. తెదేపా నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. బాలకృష్ణ జన్మదిన సందర్భంగా మంగళగిరిలో అన్న క్యాంటిన్ ప్రారంభించాలని తెదేపా నిర్ణయించింది. కాగా.. కృష్ణా-గుంటూరు జిల్లా తెదేపా నేతల్ని గృహ నిర్బంధం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • CBN HONOR: మండువవారిపాలెం గ్రామస్తులని సన్మానించిన చంద్రబాబు.. !
    CBN HONOR: మహానాడు నిర్వహణకు 140ఎకరాల భూమి ఇచ్చిన 40మంది మండువవారిపాలెం రైతుల్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్​లో సన్మానించారు. వచ్చిన వారికి శాలువాలు కప్పి సత్కరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • SUICIDE ATTEMPT: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రిమాండ్​కి పంపుతారనే భయంతో.!
    SUICIDE ATTEMPT: విజయవాడ పటమట పోలీసుల అదుపులో ఉన్న ఓ వ్యక్తి.. ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. పోలీసులు తనను రిమాండ్‌కు పంపుతారేమోననే భయంతో స్టేషన్‌లోని బాత్రూమ్‌లో వైరుతో గొంతు కోసుకున్నట్లు సమాచారం. ఇటీవల హత్యకు గురైన పుట్​బాల్ ప్లేయర్​ ఆకాష్‌ కేసులో అశోక్​తో పాటు మరో పది మందిని ఈ నెల 1న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నీట్​ పీజీ 2021: ఆ పిటిషన్లను కొట్టేసిన సుప్రీం.. కేంద్రంపై ఆగ్రహం
    NEET PG: పీజీ మెడికల్ 2021 కౌన్సెలింగ్‌పై దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. మిగిలిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్​ నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది అత్యున్నత న్యాయస్థానం. 1456 పీజీ మెడికల్‌ సీట్లు మిగలడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వైద్య విద్యలో రాజీ పడలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వరుడి ఐడియా అదుర్స్​ గురూ.. 51 ట్రాక్టర్లతో భారీ ర్యాలీగా.. ఎందుకో తెలిస్తే!
    Farmer marriage procession tractor: పెళ్లి ఊరేగింపునకు వరుడు వినూత్న ఆలోచన చేశాడు. 51 ట్రాక్టర్లతో పెళ్లి కుమార్తె ఇంటికి ఊరేగింపుగా వెళ్లాడు. తానే స్వయంగా ట్రాక్టర్ నడిపాడు. రాజస్థాన్​లోని బాడ్​మేర్​కు చెందిన రాధేశ్యామ్​ అనే రైతు ఇలా చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరోసారి కాల్పుల మోత.. ముగ్గురు దుర్మరణం
    Shooting Maryland: అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. పశ్చిమ మేరీల్యాండ్​లోని కొలంబియా మెషీన్​ అనే కంపెనీలోకి చొరబడ్డ దుండగుడు.. తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వెంటాడుతున్న ద్రవ్యోల్బణం భయాలు.. మరి పెట్టుబడుల సంగతేంటి?
    జీవితంలో సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఇందుకోసం సంపాదనలో తప్పనిసరిగా కొంత మొత్తం పెట్టుబడులకు కేటాయించాల్సిందే. వీటి నుంచి వచ్చిన రాబడితోనే సంపదను సృష్టించేందుకు అవకాశం ఉంటుంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. మన నికర రాబడిని తగ్గిస్తూ ఉంటుంది. అందుకే, దీర్ఘకాలంలో దీని ప్రభావం అంతగా ఉండని పెట్టుబడులను ఎంచుకోవడం ఎప్పుడూ అవసరం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెండో టెస్టుకు ముందు కివీస్​​కు పెద్ద షాక్​.. కెప్టెన్​కు కరోనా
    Kane Williamson Covid: ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్​ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు సారథి కేన్​ విలియమ్సన్​.. కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు శుక్రవారం ప్రారంభమయ్యే రెండో టెస్టుకు దూరమయ్యాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • SSMB 28: మహేశ్​కు జోడీగా మరోసారి రష్మిక?
    Maheshbabu SSMB 28: సూపర్​స్టార్​ మహేశ్​బాబు.. దర్శకుడు త్రివిక్రమ్​ కాంబోలో తెరకెక్కనున్న SSMB 28కు(వర్కింగ్​ టైటిల్​) సంబంధించి ఓ లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే పూజా హెగ్డేను హీరోయిన్​గా ప్రకటించిన చిత్రబృందం.. ఇప్పుడు మరో కథానాయికగా రష్మికను ఎంచుకున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details