ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TopNews: ప్రధాన వార్తలు @1PM

ప్రధాన వార్తలు @1PM

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @1PM

By

Published : Jul 5, 2021, 1:01 PM IST

  • సోషల్ మీడియాలో జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసు విచారణ
    సామాజిక మాధ్యమాల్లో(social media) హైకోర్టు జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. మూడుసార్లు స్టేటస్‌ రిపోర్టు ఇచ్చామని హైకోర్టుకు(high court) సీబీఐ తెలిపింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కర్ఫ్యూ సడలింపుపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారా..?
    కరోనా కట్టడి చర్యలపై.. ముఖ్యమంత్రి జగన్.. ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని సీఎం తెలుసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆక్సిజన్​ ప్లాంట్ ఏర్పాటు..​ తెలుగులో ట్వీట్​
    లాక్​డౌన్​(LockDown)లో ఎందరికో సహాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న సోనూసూద్(Sonu Sood).. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సునీల్‌ సీఐడీ చీఫ్‌గా ఉంటే విచారణాధికారిపై ప్రభావం'
    సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌పై దర్యాప్తు వేగంగా పూర్తి చేయాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌కు తెలుగుదేశం నేత వర్ల రామయ్య లేఖ రాశారు. సునీల్‌ సీఐడీ చీఫ్‌గా ఉంటే విచారణాధికారిపై ప్రభావం పడుతుందని అన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సింహాచలం భూముల వ్యవహారంలో విచారణాధికారి నియామకం
    సింహాచలం భూముల వ్యవహారంలో ప్రభుత్వం విచారణాధికారిని నియమించింది. విచారణాధికారిగా విశాఖ జిల్లా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ వ్యవహరిస్తారు. ఈనెల 15లోగా ప్రాథమిక నివేదిక ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్ ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రఫేల్​ ఒప్పందంపై రాహుల్​ విమర్శలు
    రఫేల్​ ఒప్పందంపై(Rafale deal) మరోమారు విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ(Rahul gandhi). మీడియా పార్ట్​ ఇన్వెస్టిగేటివ్​ జర్నలిస్ట్​ వీడియోను ట్వట్టర్​లో షేర్​ చేస్తూ.. నిజం ఎప్పటికైనా బయటపడక తప్పదని క్యాప్షన్​ను జోడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • యూపీలో జడ్పీ ఛైర్‌పర్సన్‌గా తెలుగు మహిళ
    తెలంగాణకు చెందిన శ్రీకళారెడ్డి.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని జన్పూర్‌ జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌గా భాజపా నుంచి ఎన్నికయ్యారు. మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్‌రెడ్డి కుమార్తె ఈమె. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'కరోనాపై విజయానికి చేరువయ్యాం.. కానీ'
    కరోనాపై విజయానికి అమెరికా చేరువయ్యిందని అధ్యక్షుడు(America president) జో బైడెన్‌(Joe Biden) వ్యాఖ్యానించారు. అయితే కొవిడ్​ను(Covid-19) పూర్తిగా అధిగమించలేదన్నారు. వైరస్​ రూపాంతరం చెందుతూనే ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • లాభాల్లో మార్కెట్లు-52,800 పైకి సెన్సెక్స్​
    అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియటం, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్న నేపథ్యంలో.. భారత మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడం మార్కెట్లకు దన్నుగా నిలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఐపీఎల్​-15 బ్లూప్రింట్ రెడీ.. మెగా వేలం అప్పుడే!
    ఐపీఎల్​ 15వ సీజన్(IPL 15th Edition)​ మెగా వేలానికి సంబంధించి బ్లూప్రింట్​ను ఖరారు చేసింది బీసీసీఐ. లీగ్​లోకి కొత్త ఫ్రాంఛైజీలతో పాటు జట్ల సాలరీ పర్స్​లో పెరుగుదల, మీడియా హక్కులకు సంబంధించి మార్పులు జరగనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details