ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

1PM Top News
1PM Top News

By

Published : May 12, 2021, 12:58 PM IST

  • 'జులై వరకూ కరోనా రెండో దశ ఉద్ధృతి'

కరోనా రెండో దశ నుంచి కోలుకోవడానికి భారత్​కు ఎక్కువ రోజులే పడుతుందని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్​ జమీల్ పేర్కొన్నారు. ​కరోనా రెండో దశ ఉద్ధృతి జులై వరకూ కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • మామిళ్లపల్లె ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారణ

డప మామిళ్లపల్లె ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ విచారిస్తోంది. పేలుళ్లు జరిగిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • మంత్రి సీదిరి అప్పలరాజుపై పోలీస్​ స్టేషన్లో తెదేపా నేతలు ఫిర్యాదు

రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుపై తెదేపా నేతలు గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్ల్​లో ఫిర్యాదు చేశారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో మంత్రి చేస్తున్న ప్రకటనలు ప్రజల్ని భయాందోళలకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఏపీలో రూ.100 దాటిన ప్రీమియం పెట్రోల్ ధర

పెట్రోల్ ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు బండి బయటకు తీయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు లీటర్‌ పెట్రోల్‌పై 25 పైసలు, డీజిల్‌పై 27 పైసలు పెరిగింది. ఏపీలో ప్రీమియం పెట్రోల్ ధర రూ. 101.48 కి చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వైరస్‌ బూచితో అంబులెన్స్‌కు రూ.వేలు వసూలు

కరోనా రోగులను తరలించేందుకు, మృతదేహాలను మహాప్రస్థానానికి రవాణా చేసేందుకు అంబులెన్సుల పేరుతో వాహనాలు భారీగా వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు ఎక్కడా అమలు కావడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆ యూనివర్సిటీలో కొవిడ్​తో 26మంది ప్రొఫెసర్లు మృతి

కరోనా బారిన పడిన అలీగఢ్​ ముస్లిం యూనివర్సిటీ సిబ్బందిలో ఇప్పటివరకు 44 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 26మంది ప్రొఫెసర్లు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అఫ్గాన్​లో దాడులు- రంజాన్​ మాసంలో 255 మంది మృతి

రంజాన్ మాసం మొదలైనప్పటి నుంచి అఫ్గాన్​లో 255 మంది మృతిచెందారు. తాలిబాన్లు జరిపిన పలు బాంబు దాడుల్లో 500 మందికి పైగా తీవ్రంగా గాయాలైనట్లు టోలో వార్తా సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కొవిడ్​ 2.0తో ఈ కామర్స్​ డెలివరీలకు అంతరాయం!

కరోనా రెండో దశ వ్యాప్తి , రాష్ట్రాల వారీగా విధించిన లాక్​డౌన్​ వల్ల ఈ కామర్స్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా నిత్యావసరాల డెలివరీ సమయం బాగా పెరిగినట్లు చెబుతున్నాయి. అమెజాన్ ఫ్రెష్ ఆర్డర్ల​ డెలివరీ సమయం రెండు గంటల నుంచి ఏకంగా ఒక రోజుకు పెరిగినట్లు తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రీమియర్​ లీగ్ విజేతగా మాంచెస్టర్ సిటీ జట్టు

మాంచెస్టర్​ వేదికగా జరిగే ఫుట్​బాల్​ ప్రీమియర్​ లీగ్​ విజేతగా 'మాంచెస్టర్ సిటీ' జట్టు అవతరించింది. మాంచెస్టర్​ యునైటెడ్​తో జరిగిన మ్యాచ్​లో లీసెస్టర్​ సిటీ టీమ్​ 2-1తో గెలుపొందింది. దీంతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న మాంచెస్టర్​ సిటీ జట్టుయే విజేతగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా నుంచి కోలుకున్న అల్లు అర్జున్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details