ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @1PM

...

top news
ప్రధాన వార్తలు

By

Published : Apr 16, 2021, 1:01 PM IST

  • ప్రధానికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ఏపీ కేడర్ ఐఏఎస్‌ల వార్షిక నివేదిక ఆమోదం సీఎం చేతుల్లో పెట్టడంపై ఎంపీ రఘురామకృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ డైరెక్టర్‌కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై మాజీ ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు సీబీఐ డైరెక్టర్ కు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నిర్మానుష్యంగా మారిన జుత్తాడ గ్రామం... కొనసాగుతున్న పోలీసు పహారా

విశాఖ జిల్లా పెందుర్తి మండ‌లం జుత్తాడ గ్రామం దాదాపుగా నిర్మానుష్యంగా మారింది. సంచలనం రేపిన హత్యోదంతం తర్వాత భయాందోళనకు గురైన గ్రామస్థులు ఇళ్లకు తాళాలు వేసి.. సమీప ప్రాంతాల్లోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'కరోనా కట్టడిలో కేంద్రానివి తుగ్లక్ చర్యలు'

కరోనా కట్టడిలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై విమర్శలు గుప్పించారు రాహుల్​ గాంధీ. వైరస్​ నియంత్రణకు తుగ్లక్​ లాక్​డౌన్​, గంటలు కొట్టడం, దేవుడ్ని ప్రార్థించడం వంటివి చేస్తోందని ట్వీట్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రూ.98 కోట్ల విలువైన డ్రగ్స్​ స్వాధీనం

దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాదకద్రవ్యాలను తరలిస్తున్న జాంబియా దేశస్థులను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారి నుంచి రూ.98 కోట్లు విలువచేసే డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెరికా ఫెడ్​ఎక్స్​ వద్ద కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఇండియానాపొలిస్​ నగరంలోని ఫెడ్​ఎక్స్​ వద్ద ఈ ఘటన జరగగా, పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైనా హై జంప్- క్యూ1లో 18.3% వృద్ధి రేటు!

కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు సర్వ శక్తులు ఉపయోగిస్తున్నాయి. అయినప్పటికీ వృద్ధి అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. చైనాలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా 2.0తో విమాన సంస్థలకు రూ.10 వేల కోట్ల నష్టం!

కరోనా రెండో దశ విజృంభణ విమానయాన సంస్థలకు మరోసారి భారీ నష్టాలు తెచ్చిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ప్లాన్-బీ'తో ఒలింపిక్స్​కు సాత్విక్-చిరాగ్​ జోడీ

భారత బ్యాడ్మింటన్​ డబుల్స్​ ఆటగాళ్లు సాత్విక్​ సాయిరాజ్​- చిరాగ్ శెట్టి ఒలింపిక్స్​ కోసం తమ ఆటలో మార్పులు చేసుకున్నట్లు తెలిపారు. కొత్త కోచ్​ మాథియాస్​ బో ఆధ్వర్యంలో యూరోపియన్ శైలి ఆటను నేర్చుకున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సెహరి' టీజర్​.. 'జాతిరత్నాలు' వీడియో సాంగ్​

కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'సెహరి' టీజర్​తో పాటు 'జాతిరత్నాలు' చిత్రంలోని 'సిల్లీ ఫూల్స్​'​ వీడియో సాంగ్​ విడుదల అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details