ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1PM - ap top ten news

..

top news
ప్రధాన వార్తలు

By

Published : Apr 7, 2021, 1:00 PM IST

  • ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ
    ఎస్‌ఈసీ అప్పీల్‌పై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు రద్దుచేయాలని కోరుతూ.. ఎస్‌ఈసీ కార్యదర్శి కన్నబాబు అప్పీల్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది సి.వి. మోహన్‌రెడ్డి వాదనలు వినిపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రేగులగడ్డలో సున్నపురాయి తవ్వకాలపై హైకోర్టు స్టే
    గుంటూరు జిల్లా మాచవరం మండలం రేగులగడ్డలో సున్నపురాయి తవ్వకాలపై హైకోర్టు స్టే ఇచ్చింది. మైనింగ్‌పై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మైనింగ్‌, రెవెన్యూ అధికారులను ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆటోను ఢీకొన్న లారీ.. ఆరుగురికి గాయాలు
    నెల్లూరు జిల్లా బురాన్​పూర్​ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను.. వ్యాన్​ వెనకనుంచి వచ్చి ఢీ కొట్టటంతో ప్రమాదం నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'హైకోర్టు జడ్జీలుగా మహిళలను నియమించాలి'
    హైకోర్టుల్లో.. అర్హులైన మహిళా న్యాయమూర్తులను నియమించాలని మహిళా న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టును కోరింది. 1950 నుంచి ఇప్పటివరకూ సుప్రీంకోర్టులో కేవలం 8 మంది మహిళా న్యాయమూర్తులు మాత్రమే నియమితులయ్యారని గుర్తుచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'భారత్​ నిర్ణయాలు.. భావితరాలకు మార్గదర్శకాలు'
    ప్రపంచ వేదికపై భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా పర్యావరణ రాయబారి జాన్​ కెర్రీ పేర్కొన్నారు. వాతావరణ మార్పులను కట్టడి చేయడానికి భారత్​ చేపట్టే నిర్ణయాత్మక కార్యచరణ.. రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కరోనాతో ఇంకా జీవన్మరణ పోరులోనే అమెరికా'
    కొవిడ్-19తో అమెరికా ఇంకా జీవన్మరణ పోరాటం చేస్తూనే ఉందని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్​ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలను పాటించాలని ప్రజలను కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కీలక వడ్డీ రేట్లు యథాతథం: ఆర్​బీఐ
    కీలక వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఉన్న 4 శాతం రెపోరేటు, 3.3 శాతం రివర్స్‌ రెపోరేటు వరుసగా ఐదోసారి యథాతథంగా కొనసాగనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆర్సీబీకి శుభవార్త.. జట్టుతో కలిసిన పడిక్కల్
    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యువ ఓపెనర్​ దేవ్​దత్​ పడిక్కల్ బయోబబుల్​లో జట్టుతో కలిశాడు. మార్చి 22న కరోనా బారినపడిన ఇతడు ఇటీవలే కోలుకున్నాడు. దీంతో బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈరోజు జట్టుతో కలిశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • సుశాంత్​ బయోపిక్​ తెరకెక్కించనున్న ఆర్జీవీ!
    నటుడు సుశాంత్​​ రాజ్​పుత్​ బయోపిక్​ను నిర్మించేందుకు దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. సుశాంత్​ లవ్​స్టోరీ మొదలుకొని.. చిత్రపరిశ్రమలో రాజకీయాలు, డ్రగ్స్​ వంటిని ఇందులో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details