- సీజేఐగా జస్టిస్ ఎన్.వి. రమణ- రాష్ట్రపతి ఆమోదం
భారత దేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు ఆయన నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉన్నత పీఠంపై ఊరు బిడ్డ.. పులకించిన పురిటి గడ్డ
దేశానికి అత్యున్నత న్యాయాధీశుడిని అందించిన ఆ ఊరు మెరిసింది. ఓనమాలు దిద్దించిన అక్కడి బడి మురిసింది. మిత్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా నియమితులైన ఎన్వీ రమణ స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం సంతోషంతో పులకరిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అధికార లాంఛనాలతో జవాను జగదీశ్ అంత్యక్రియలు పూర్తి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్-సుకుమా సరిహద్దులోని జోనాగుడా వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందిన జగదీశ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. జగదీశ్ స్వస్థలమైన విజయనగరం జిల్లా గాజులరేగులో.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- యానాంలో సజావుగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
పుదుచ్చేరి రాష్ట్రంలో 15 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ సజావుగా ప్రారంభమైంది. 37,811 మంది ఓటర్లున్న యానాంలో.. 33 పోలింగ్ బూతులు, 27 ఉపపోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో రికార్డు స్థాయిలో టీకా పంపిణీ
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టీకా పంపిణీ జరుగుతోంది. తాజాగా ఒక్కరోజులో 43లక్షలకుపైగా మందికి వ్యాక్సిన్ అందించింది ప్రభుత్వం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా విజృంభణ- దిల్లీలో రాత్రి కర్ఫ్యూ