ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - top news today

ప్రధాన వార్తలు @ 1 PM

top news
ప్రధాన వార్తలు

By

Published : Feb 27, 2021, 1:00 PM IST

  • రూ.కోటి తీసుకుని తహసీల్దార్ మోసం చేశాడంటూ.. దంపతుల ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా దుత్తలూరు సచివాలయం ఎదుట.. తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఓ జంట ఆత్మహత్యాయత్నం చేయడం.. కలకలం సృష్టించింది. కోటి రూపాయలకు పైగా వసూలు చేసి మోసం చేశాడంటూ.. దుత్తలూరు తహసీల్దార్ చంద్రశేఖర్​పై ఆ జంట ఆరోపణలు చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'అనరాని మాటలన్నాడు.. దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు'

"మేడా విజయ్‌అనే వ్యక్తి.. ఎమ్మెల్యే తమ్ముడినని చెబుతూ నన్ను బూతులు తిట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అంటే.. దిక్కున్నచోట చెప్పుకోమన్నాడు" అంటూ... కడప జిల్లా నందలూరు విద్యుత్‌శాఖ ఏఈ సురేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లా వాసి అనుమానాస్పద స్థితిలో మృతి

ఆస్ట్రేలియాలో ప్రకాశం జిల్లాకు చెందిన హరీశ్‌బాబు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన హరీశ్‌బాబు.. ఆరేళ్లుగా ఆస్ట్రేలియాలోని ఆడిలైట్‌ స్టేట్‌ సల్స్‌బరీలో ఉంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మార్చి 2 నుంచి 4 వరకు ఇండియా మారిటైం సదస్సు

మార్చి 2 నుంచి 4 వరకు ఇండియా మారిటైం సదస్సు నిర్వహిస్తున్నట్లు విశాఖ పోర్టు ఛైర్మన్ కె.రామ్మోహనరావు తెలిపారు. పెట్టుబడులు రావాలన్నదే నౌకాయాన లక్ష్యమని చెప్పారు. విదేశీ సంస్థల ఆసక్తి వల్ల మరింత ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మన బొమ్మలు భారతీయ జీవనశైలిని ప్రతిబింబిస్తాయి'

'ది ఇండియా టాయ్​ ఫెయిర్​-2021'ను వర్చువల్​గా ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మన బొమ్మలు భారతీయ జీవనశైలిలో భాగమైన పునర్వినియోగం, పునర్నిర్మానాలను ప్రతిబింబిస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​కు అమెరికా 216 బిలియన్​ డాలర్ల బాకీ

అమెరికా భారత్​కు 216 బిలియన్​ డాలర్లు బాకీ ఉంది. ఈ విషయాన్ని ఆ దేశ చట్టసభ్యలు, రిపబ్లికన్​ పార్టీ నేత అలెక్స్ మూనీ వెల్లడించారు. అమెరికా అప్పుల్లో కూరుకుపోయిందని, ఈ పరిస్థితి నుంచి బయటపడే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ప్లీజ్..​ మా దేశంలో ప్రజాస్వామ్యాన్నిబతికించండి'

మయన్మార్​లో సైనిక తిరుబాటును తీవ్రంగా ఖండిస్తూ బహిరంగ ప్రకటన జారీ చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని విజ్ఞప్తి చేశారు ఆ దేశ రాయబారి కయాన్​ మోతున్​ . తమ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించేందుకు ప్రపంచ దేశాలు సహకరించాలని ఐరాస సమావేశంలో కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వృద్ధి సానుకూలమే.. కొత్త కేసులతోనే భయం'

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం(అక్టోబరు-డిసెంబరు)లో దేశ స్థూల దేశీయోత్పత్తి 0.4 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. గత ఏడాదితో పోలిస్తే జీడీపీలో పెరుగుదల రూ.14వేల కోట్లే అయినా.. సాంకేతిక మాంద్యం నుంచి బయటపడేందుకు దోహదపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కెప్టెన్సీ కోసం స్మిత్​ ఎదురుచూస్తున్నాడు: పైన్

మరోసారి కెప్టెన్​ బాధ్యతలు చేపట్టడానికి స్టీవ్​​ స్మిత్​ ఉత్సాహంగా ఉన్నాడని అన్నాడు ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్​ పైన్. తదుపరి కెప్టెన్​గా జట్టు పరిగణిస్తున్న వారిలో అతడు కూడా ఉన్నాడని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కంగన ఈమెయిల్​ కేసులో హృతిక్​ వాంగ్మూలం

నకిలీ మెయిల్​ కేసులో బాలీవుడ్​ హీరో హృతిక్ ​రోషన్​.. ముంబయి నేర విభాగం పోలీసుల ముందు హాజరయ్యారు. అధికారులు ఆయన్ను విచారించి వాంగ్మూలాన్ని రికార్డు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details