ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @1pm - top news today

...

top news
ప్రధాన వార్తలు

By

Published : Feb 13, 2021, 1:00 PM IST

  • పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 10.30 గంటలకు ఓటింగ్ శాతం..

రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. ఉదయం 10 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 38.07 శాతంగా నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి ఘర్షణ

పోలింగ్‌ కేంద్రం వద్ద మాటామాటా పెరిగి ఘర్షణ నెలకొంది. ఇరువర్గాల వారు పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిని పోలీసులు చక్కదిద్దారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అక్కడ బ్యాలెట్ పత్రాలు మాయం..

రెండో దశ పంచాయతీ ఎన్నికల వేళ బ్యాలెట్ పత్రాలు మాయం అయిన ఘటన గుంటూరు జిల్లాలోని నడిగడ్డ పోలింగ్​ బూత్​లో చోటుచేసుకుంది. రిజర్వు బ్యాలెట్ పత్రాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ట్రక్కు, జీపు ఢీ.. ఆరుగురు మృతి

రాజస్థాన్​ సూరత్​గఢ్​ జిల్లాలో ఓ ట్రక్కు, జీపు ఢీకొని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భాజపా కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాది అరెస్ట్​

గతేడాది అక్టోబర్​లో ముగ్గురు భాజపా కార్యకర్తలను, ఓ పోలీస్ అధికారిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదిని జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముష్కరుడిని.. జహూర్ అహ్మద్​ రాథర్​ అలియాస్​ ఖలీద్​గా గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అజిత్​ డోభాల్​కు భద్రత పెంపు

జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ భద్రతను పెంచారు అధికారులు. జైషే మహ్మద్​కు చెందిన ఓ ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలో.. డోభాల్​ ఆఫీసు వద్ద ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టు ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మయన్మార్​లో ఆగని పౌర నిరసనలు

మయన్మార్​లో సైనిక పాలనకు వ్యతిరేకంగా చేపడుతున్న పౌర నిరసనలు రెండోవారానికి చేరాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి, నిర్బంధంలోని ఆంగ్​ సాన్​ సూకీని విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి ఆందోళనలు చేపట్టారు ప్రజలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఆత్మనిర్భర్​ భారత్​కు 2021 పద్దు బాటలు..'

సంక్షోభంతో వచ్చిన అవకాశాన్ని కేంద్రం వినియోగించుకుందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ వెల్లడించారు. దేశానికి దీర్ఘకాలంలో కావాల్సిన వృద్ధి కోసం.. సంక్షోభంలోనూ సంస్కరణలు చేపట్టినట్టు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ముగిసిన భారత్​ కథ

మిక్స్​డ్​ డబుల్స్​లో బోపన్న జోడీ నిష్క్రమణతో.. ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భారత కథ ముగిసింది. ఇప్పటికే అంకితా రైనా, దివిజ్ శరణ్​​లు పురుషులు, మహిళల డబుల్స్​లో ఓటమి పాలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'వాలంటైన్స్​ డే' కానుకలతో నాని, అఖిల్

ప్రేమికుల దినోత్సవానికి రోజు ముందుగా తమ సినిమాల్లో పాటల్ని విడుదల చేశారు హీరోలు నాని, అఖిల్. దీనితో పాటు పలు చిత్రాల కొత్త సంగతులు కూడా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details