ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 1 PM - ap top ten news

ప్రధాన వార్తలు@ 1 PM

top news
ప్రధాన వార్తలు

By

Published : Feb 12, 2021, 1:00 PM IST

  • కొడాలి నానికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నానికి ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసు జారీచేసింది. ఎస్‌ఈసీని కించపరిచేలా మీడియా సమావేశంలో మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేసింది. కొడాలి నాని తన వ్యాఖ్యలపై సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం అంగీకారం!

రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలతో పాటు పురపాలక ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఎన్నికల నిర్వహణకు రాత పూర్వక అంగీకారం తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'మోదీ జీ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పునరాలోచించండి'

ఏపీపై కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపై వైకాపా రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్.. పార్లమెంట్​లో ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ ప్రైవేటీకరణకు క్యాబినేట్ ప్రణాళిక సిద్ధం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏపీకి కేటాయింపులు ఏమీ చేయలేదని వాపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్కెచ్ వేసి కిడ్నాప్.. ఆ తర్వాత గ్యాంగ్ రేప్.. పోలీసుల అదుపులో నలుగురు?

ఘట్కేసర్ ఫార్మిసీ విద్యార్థిని కిడ్నాప్​ కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారమే విద్యార్థినిని అపహరించి, సామూహిక అత్యాచారం చేశారని రాచకొండ పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఆధారంగా నలుగురు ఆటో డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యుద్ధప్రాతిపదికన 'ఆపరేషన్​ తపోవన్​'

ఉత్తరాఖండ్​ వరద సహాయక చర్యలు ఆరో రోజూ కొనసాగుతున్నాయి. ఇద్దరు సజీవంగా బయటపడగా... మరో 204 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిన ప్రధాని'

ప్రధాని నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు అప్పగించారని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. మోదీ చైనా ముందు తలవంచారని విమర్శలు చేశారు. భారత బలగాలు ఫింగర్​ 4 నుంచి ఫింగర్​ 3కి ఎందుకు వస్తున్నాయో ప్రధాని, రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారత్​-చైనా 'సయోధ్య'పై అమెరికా హర్షం

భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు చేస్తోన్న ప్రయత్నాలను అమెరికా స్వాగతించింది. బలగాల ఉపసంహరణను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేంద్రం, ట్విట్టర్​కు సుప్రీంకోర్టు నోటీసులు

విద్వేష వార్తల వ్యాప్తిని కట్టడి చేయాలని దాఖలైన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ​ మేరకు కేంద్రంతో పాటు ట్విట్టర్​కు శుక్రవారం నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఐపీఎల్-14లో శ్రీశాంత్​కు నిరాశ - వేలంలో దక్కని చోటు

ఐపీఎల్​ 14వ సీజన్​ వేలం జాబితాలో ఫాస్ట్​ బౌలర్​ శ్రీశాంత్​కు చుక్కెదురైంది. ఏ ఒక్క ఫ్రాంచైజీ అతని పేరును తుది జాబితాలోకి తీసుకోలేదు. ఈ నెల 18న చెన్నై వేదికగా ఆటగాళ్ల వేలం జరుగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ప్రభాస్ 'రాధేశ్యామ్​' టీజర్​కు టైమ్ ఫిక్స్

'రాధేశ్యామ్' టీజర్​ గ్లింప్స్​ను వాలంటైన్స్​ డే ఉదయం 9:18 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్​ను కూడా పోస్ట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details