ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @1PM - breaking news

.

ప్రధాన వార్తలు @9AM
ప్రధాన వార్తలు @9AM

By

Published : Feb 10, 2021, 1:01 PM IST

  • మీడియాతో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి

మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడేందుకు హైకోర్టు అనుమతులు జారీ చేసింది. అయితే ఎస్​ఈసీ, కమిషనర్ పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియపై మాట్లాడవద్దన్న న్యాయస్థానం పెద్దిరెడ్డికి పలు సూచనలు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • హైకోర్టు ఆదేశాలపై... సుప్రీం కోర్టు స్టే

బిల్డ్ ఏపీ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై... సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పల్లె తీర్పు: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు ఇవే..

తూర్పుగోదావరి జిల్లా పోతులూరులో పంచాయతీ అభ్యర్ధి ప్రకటనపై ఉద్రిక్తత ఏర్పడింది. అధికారులు మూడు సార్లు ఓట్లు లెక్కింపు చేపట్టగా...స్థానికులు అగ్రహాం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చాలా దారుణం'

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు మొదట్నుంచీ చెబుతున్నామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఐదు దశాబ్దాల క్రితం ఎంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును.. ప్రైవేటీకరణ కాకుండా చూసుకోవాలని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకూడదని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం.. రాజకీయాలకు అతీతంగా పోరాడుదామంటూ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వరంగల్ ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

తెలంగాణలోని వరంగల్ గ్రామీణ జిల్లా ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ముగ్గురు మృతి చెందారు. నీటి ప్రవాహానికి కారు కొట్టుకుపోయింది. స్థానికులు ఒకరిని కాపాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • శబరిమలకు భక్తుల రాకపై కేరళ కీలక నిర్ణయం

మలయాళ 'కుంభనెల' ఉన్నందున శబరిమల అయ్యప్ప దర్శనానికి మరింత మంది భక్తులను అనుమతించాలన్న ట్రావెన్​కోర్​ దేవస్థానం విజ్ఞప్తిని కేరళ ప్రభుత్వం తోసిపుచ్చింది. కరోనా తీవ్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దిల్లీ ర్యాలీ హింస కేసులో మరొకరు అరెస్ట్​

దిల్లీలో ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. తాజాగా ఇక్బాల్​ సింగ్​ అనే నిందితుడిని అరెస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మయన్మార్​లో పౌర నిరసనలు ఉద్ధృతం

ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం కైవసం చేసుకున్న మయన్మార్‌ సైన్యానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజాందోళనలు ఉద్రిక్తంగా మారాయి. వేల మంది ప్రజలు సైన్యానికి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. మయన్మార్‌లోని ప్రధాన నగరాలన్నీ ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. నిరసనకారులపై నీటి ఫిరంగులు, బాష్పవాయు గోళాలు ప్రయోగించింది సైన్యం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆస్ట్రేలియన్​ ఓపెన్​ నుంచి బోపన్న ఔట్​

ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో పలువురు టాప్​ సీడ్​ ఆటగాళ్లు పరాజయం మూటగట్టుకున్నారు. పురషుల డబుల్స్​ నుంచి భారత ఆటగాడు రోహన్​ బోపన్న జంట ఓటమి పాలైంది. మాజీ యూఎస్ ఓపెన్​ విజేత ఆండ్రెస్కు సైతం టోర్నీ నుంచి నిష్క్రమించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'లైగర్' అప్​డేట్.. అలరిస్తున్న 'నాట్యం' టీజర్​

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో లైగర్, నాట్యం, వరుడు కావలెను, టక్ జగదీష్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్ చిత్ర సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details