ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రధాన వార్తలు @1pm

...

top news
ప్రధాన వార్తలు

By

Published : Jan 30, 2021, 1:00 PM IST

  • పంచాయతీ ఎన్నికల దృష్ట్యా సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు

పంచాయతీ ఎన్నికలకు పోలింగ్​ జరిగే ఫిబ్రవరి 9, 11, 13, 21 తేదీల్లో సెలవు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, దుకాణాలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా కె.కన్నబాబు బాధ్యతలు చేపట్టారు. ఆయనను ఎస్ఈసీ కార్యదర్శిగా నియమిస్తూ.. నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టిపెడతాయి: ఎస్‌ఈసీ

పంచాయతీ ఎన్నికలు సకాలంలో పారదర్శకంగా జరగాలని ఎస్​ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. కడపలో పర్యటించిన ఆయన.. ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పల్లెల్లో ప్రశాంతత నెలకొంటేనే గ్రామస్వరాజ్యం సాధ్యం: చంద్రబాబు

మహాత్మ గాంధీ ఆశించిన గ్రామ స్వరాజ్యం సిద్ధించాలంటే ప్రతి పల్లె స్వయం సమృద్ధిని సాధించాలని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాళ జాతిపిత వర్ధంతి సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్ నివాళులు అర్పించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రాజ్​ఘాట్​ వద్ద 'గాంధీ'కి మోదీ సహా ప్రముఖుల నివాళి

మహాత్మగాంధీ వర్ధంతి సందర్బంగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు ప్రముఖులు.. రాజ్​ఘాట్​ వద్ద నివాళులర్పించారు. మహాత్ముని ఆదర్శాలు లక్షలాది మందిని ప్రేరేపిస్తున్నాయని మోదీ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిల్లీ పేలుడు కేసు ఎన్​ఐఏకు అప్పగింత!

దిల్లీలోని ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం వద్ద పేలుడు ఘటన విచారణను ఎన్​ఐఏకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుపై దిల్లీ పోలీసు స్పెషల్ సెల్, దిల్లీ ఫోరెన్సిక్, ఇంటిలిజెన్స్ బ్యూరో ఇప్పటికే దర్యాప్తు మొదలు పెట్టాయి. మూడు రోజుల్లో హోం శాఖ ఈ విషయంపై అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమెరికాలో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం

అమెరికా కాలిఫోర్నియాలో గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొందరు దుండగులు. ఈ జాత్యహంకార చర్యపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు భారతీయ అమెరికన్లు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • తుపాను బీభత్సం- బురదలో కూరుకుపోయిన గుర్రాలు!

అమెరికాలో తుపాను కారణంగా మూగ జీవాలు ఇక్కట్లు పడుతున్నాయి. ఉత్తర కాలిఫోర్నియాలో వరదల కారణంగా.. సలీనస్​ ప్రాంతంలో బుధవారం రాత్రి గుర్రాల పాకను బురద ముంచెత్తింది. దాంతో రెండు గుర్రాలు అందులోనే చిక్కుకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 87 ఏళ్ల చరిత్రలో తొలిసారి 'రంజీ' టోర్నీ రద్దు

ఈ ఏడాది రంజీ ట్రోఫీని నిర్వహించట్లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాల క్రికెట్​ అసోసియేషన్ల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మీర్జాపుర్ నిర్మాతలకు ఊరట.. అరెస్ట్​ నిలిపివేసిన కోర్టు

మీర్జాపుర్ వెబ్​సిరీస్ నిర్మాతలకు ఊరట లభించింది. తమ ప్రాంతాన్ని తప్పుగా చూపించారని ఓ వ్యక్తి కేసు నమోదు చేయగా దీనిపై విచారించిన అలహాబాదు కోర్టు నిర్మాతల అరెస్టును తాత్కాలికంగా నిలిపివేసింది. మార్చి మొదటి వారానికి విచారణ వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details