- సేంద్రీయ విధానంలో మిర్చి సాగు మంచి ఫలితాలు ఇస్తుంది: జీవీఎల్
సేంద్రీయ విధానంలో మిర్చి సాగు చేయడం వలన మంచి దిగుబడి వస్తుందని మిర్చి టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ జీవీఎల్ నరసింహారావు అన్నారు. సేంద్రీయ సాగుపై జరిగిన ఆన్లైన్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మెరుగైన యాజమాన్య విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి సంచలన వ్యాఖ్యలు
దుబ్బాక ఉపఎన్నికల సందర్భంగా భాజపా నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై కేంద్ర హోంశాఖ అధికారులతో చర్చిస్తానని.. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు లేదా మరేం చేయవచ్చన్నది ఆలోచిస్తా’ అని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సలాం కుటుంబానికి రూ. 25లక్షల ఆర్థికసాయం
కర్నూలు జిల్లా నంద్యాలలో సామూహిక ఆత్మహత్య ఘటనలో... బాధిత బంధువులకు ప్రభుత్వం తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సాయం అందింది. అబ్దుల్ సలాం అత్తయ్యకు కలెక్టర్ వీరపాండియన్, అధికారులు చెక్కును అందించారు. అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షం
నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ డౌన్.. కామెంట్లతో నెటిజన్లు ఫైర్
సాంకేతిక సమస్యల కారణంగా గురువారం ఉదయం యూట్యూబ్ సేవలకు అంతరాయం కలిగింది. దీనిపై స్పందించిన యాజమాన్యం పరిస్థితిని గంటలోపే చక్కదిద్దింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కరోనా వైరస్‌లో కొత్త జన్యువు- గుర్తించిన శాస్త్రవేత్తలు