ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరాబాద్​లో ముమ్మర తనిఖీలు.. మందుబాబులపై 1,814 కేసులు - hyderabad drunk and drive cases updates

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్​ 31 అర్ధరాత్రి హైదరాబాద్​లో పోలీసులు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు చేపట్టారు. మూడు కమిషనరేట్ల పరిధిలో.. 1814 కేసులు నమోదు చేశారు.

hyderabad drunk and drive rides
హైదరాబాద్​లో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ కేసులు

By

Published : Jan 1, 2021, 9:38 PM IST

హైదరాబాద్​లో డిసెంబర్ 31 అర్ధరాత్రి.. ట్రాఫిక్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో మోతాదుకు మించి మద్యం తాగి.. వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. తెల్లవారుజామువరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు.. మూడు కమిషనరేట్ల పరిధిలో 1,814 మందిపై కేసులు పెట్టారు.

అత్యధికంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 931 మంది మందుబాబులపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లలో ఇద్దరు మహిళలున్నారు. 721 ద్విచక్ర వాహనాలు, 190 కార్లు, 18 ఆటోలు, 2 లారీలను పోలీసులు సీజ్ చేశారు.

హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 25 ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. 496 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో 387 మందిపై కేసులు పెట్టారు. వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒక మహిళ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీచూడండి:ఆదోని పరువు హత్య కేసులో ఇద్దరు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details