రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 39,099 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 179 కొత్త కేసులు నమోదయ్యాయి. వీరితో కలిపి మొత్తం కరోనా బాధితుల సంఖ్య 8,86,245కు చేరింది. వైరస్ బారిన పడి గుంటూరు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,142గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మరో 231 మంది కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8.77 లక్షలకు పైగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,660 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా కేసులు.. ఒకరు మృతి
రాష్ట్రంలో కొత్తగా 179 మందికి కరోనా సోకింది. 24 గంటల వ్యవధిలో ఓ వ్యక్తి మహమ్మారి బారిన పడి చనిపోయినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా కేసులు.. ఒకరు మృతి