ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: దీపం అంటుకుని 17 నెలల చిన్నారి మృతి - child dead at ponnari village news

తులసి గద్దె వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు గౌనుకు అంటుకుని 17 నెలల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్​ జిల్లా పొన్నారి గ్రామంలో చోటు చేసుకుంది.

child dead at ponnari village
దీపం అంటుకుని 17 నెలల చిన్నారి మృతి

By

Published : Nov 1, 2020, 10:01 PM IST

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం పొన్నారి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దీపం అంటుకుని శ్రావణి అనే 17 నెలల చిన్నారి మృత్యువాతపడింది. గ్రామానికి చెందిన శ్రీకాంత్, పల్లవి దంపతుల కూతురు శ్రావణి శనివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా తులసి గద్దె వద్ద వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు పాప గౌనుకు అంటుకుంది. ఎవరూ చూడకపోవడం వల్ల ఆ మంటల్లో శ్రావణి పూర్తిగా కాలిపోయింది.

గమనించిన తల్లిదండ్రులు చిన్నారిని తొలుత రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గం మధ్యలో శ్రావణి మృతి చెందింది. చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details