ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ ఎంపీ రెేవంత్​రెడ్డికి 14 రోజుల రిమాండ్​

మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​రెడ్డి ఉప్పరపల్లి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్​ విధించింది. అనుమతి లేకుండా డ్రోన్​ ఎగురవేశారన్న కేసులో కోర్టు చర్యలు తీసుకుంది. కాగా రేవంత్​రెడ్డి అరెస్టును కాంగ్రెస్​ నేతలు ఖండించారు.

తెలంగాణ ఎంపీ రెేవంత్​రెడ్డికి 14 రోజుల రిమాండ్​
తెలంగాణ ఎంపీ రెేవంత్​రెడ్డికి 14 రోజుల రిమాండ్​

By

Published : Mar 5, 2020, 8:33 PM IST

తెలంగాణ ఎంపీ రెేవంత్​రెడ్డికి 14 రోజుల రిమాండ్​

అనుమతి లేకుండా డ్రోన్‌ ఎగురవేశారన్న కేసులో అరెస్టయిన తెలంగాణ ఎంపీ రేవంత్‌రెడ్డికి ఉప్పర్‌పల్లి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం పోలీసులు ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు.

రేవంత్ రెడ్డి అరెస్టును పలువురు కాంగ్రెస్‌ నేతలు ఖండించారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవిలు ఆరోపించారు. ఎంపీని అరెస్ట్ చేయడమేంటని వారు ఒక ప్రకటనలో ప్రశ్నించారు.

తెలంగాణలో నియంత పాలన సాగుతోందని... రాజ్యాంగం, చట్టాలతో పని లేకుండా కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. ప్రజాస్వామిక వాదులు, మేధావులు, విద్యావంతులు ఆలోచించాలని, ఈ అప్రజాస్వామిక పాలనపై కలిసికట్టుగా ఉద్యమించాల్సి ఉందని పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి:

'పోటీ లేకుండా గెలవాలనే రహస్య జీవోలు'

ABOUT THE AUTHOR

...view details