ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - ap top ten news

..

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11AM

By

Published : May 30, 2022, 10:59 AM IST

  • CM Jagan: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ హామీల అమలు.. మూడేళ్ల పాలనపై సీఎం జగన్‌ ట్వీట్
    CM Jagan: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. సంక్షేమ పాలనతో మూడేళ్లు పూర్తి చేసుకున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా.. ప్రజల ప్రేమ, ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతోందంటూ.. ఆయన ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రెంటచింతల రోడ్డుప్రమాదంపై... చంద్రబాబు, నారా లోకేశ్​ దిగ్భ్రాంతి
    CBN and Lokesh on road accident: పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై చంద్రబాబు, నారా లోకేశ్​ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రలకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • New varieties of rice: మూడు కొత్త వరి వంగడాలు
    New varieties of rice: బాపట్ల జిల్లాలోని బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు బీపీటీ-3082 అనే కొత్త వంగడాన్ని ఆవిష్కరించారు. మరో రెండు బీపీటీ-2846, బీపీటీ-2841 వంగడాలూ మూడేళ్ల ప్రయోగాత్మక సాగు పూర్తి కావడంతో మార్కెట్లోకి విడుదల చేయటానికి సిద్ధం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Robbery: నిందితులను పట్టించిన ‘రంగు’.. దారి దోపిడీ ముఠా అరెస్ట్‌
    Robbery: ఊరు వెళ్లడానికి వాహనం కోసం వేచిచూస్తున్న వ్యక్తిని బెదిరించి డబ్బులు లాక్కున్నారు కొందరు యువకులు. అయితే.. తప్పించుకోవాలనుకున్న వారిని.. వారు వాడిన ద్విచక్ర వాహనాలే పట్టించాయి. ఆ వాహనాలకున్న నంబర్​ ప్లేట్లన్లు నిందితులు వంచేయగా.. వాటి రంగుల ఆధారంగా వారిని పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మరణాన్ని ముందుగానే ఊహించిన సిద్ధూ మూసేవాలా?
    sidhu moose wala death: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా తన మరణాన్ని ముందుగానే ఊహించారని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఓ పాటలో మరణం గురించి మూసేవాలా చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు
    India Corona cases: దేశంలో కొత్తగా 2,706 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. 2,070మంది కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేపాల్​ విమానం ఆచూకీ లభ్యం
    nepal plane crash: నేపాల్​లో గల్లంతైన విమానం ఆచూకీ సన్సోవారో సమీపంలో లభ్యమైంది. ఈ మేరకు సహాయక బృందాలు విమాన శకలాలను గుర్తించినట్లు నేపాల్ ఆర్మీ వెల్లడించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ లాభాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 800 ప్లస్​
    అంతర్జాతీయ మార్కెట్లు నుంచి సానుకూల పవనాలకు తోడు కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో దేశీయ సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​ 820 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతుండగా.. నిఫ్టీ 16,500 పైన ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అంచనాలకు మించి అదరగొట్టిన గుజరాత్​.. హార్దిక్‌ కెప్టెన్సీ అదుర్స్​
    ఇదేం జట్టు.. ఒక్క పెద్ద స్టార్‌ అయినా ఉన్నాడా? ఫామ్‌లో లేని క్రికెటర్లే ఎక్కువ.. బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూర్పు కుదిరేనా? హార్దిక్‌ పాండ్య కెప్టెనా? సారథిగా అనుభవం లేని అతని చేతికి పగ్గాలు ఎందుకు? అసలే కొత్త జట్టు.. పెద్ద పెద్ద ప్రత్యర్థులతో తలపడి ఎలాంటి ప్రదర్శన చేస్తుందో? ఇలా ఎన్నో ప్రశ్నలు. కానీ తమ ప్రదర్శనతో వాటన్నింటికీ దిమ్మతిరిగేలా గుజరాత్‌ సమాధానమిచ్చింది. టీ20 లీగ్‌లో అడుగుపెట్టిన తొలి సీజన్‌లోనే విజేతగా నిలిచి తన ప్రయాణాన్ని ఘనంగా మొదలెట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • జూన్​లో కొత్త సినిమాల జోరు
    కొన్ని నెలలుగా తెలుగు చిత్రసీమలో విడుదల ఊసులే వినిపించాయి. కాలేజీ విద్యార్థులు బ్యాక్‌లాగ్స్‌తో సతమతమైనట్టే... కరోనా దెబ్బకు తెలుగు చిత్రసీమలోనూ పలు సినిమాలు పేరుకుపోయిన విషయం తెలిసిందే. ఏళ్లుగా సెట్స్‌పైనే మగ్గిన పలు చిత్రాలు ఈ ఏడాది ఆరంభం నుంచే విడుదల కోసం పోటీ పోడ్డాయి. ఎట్టకేలకి అగ్ర తారలు నటించిన పలు సినిమాలు ఒకొక్కటిగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details